వ‌ర‌ల్డ్ నెం1 బ్యాట‌ర్‌గా టీమిండియా స్టార్ ఓపెన‌ర్‌

Published on Tue, 06/17/2025 - 15:44

ఐసీసీ మ‌హిళ‌ల వ‌న్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో టీమిండియా స్టార్ ఓపెన‌ర్ స్మృతి మంధాన సత్తాచాటింది. తాజాగా ఐసీసీ ప్రక‌టించిన ర్యాకింగ్స్‌లో మంధాన త‌న ఆరేళ్ల నిరీక్ష‌ణ‌కు తెర‌దించుతూ.. అగ్ర‌స్ధానాన్ని కైవ‌సం చేసుకుంది. ఇటీవ‌ల శ్రీలంక‌, ద‌క్షిణాఫ్రికాతో జ‌రిగిన ముక్కోణ‌పు సిరీస్‌లో అద్బుత‌ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌ర‌చ‌డంతో మంధాన తిరిగి త‌న టాప్ ర్యాంక్‌ను సొంతం చేసుకుంది.

మంధాన ప్ర‌స్తుతం 727 రేటింగ్ పాయింట్లతో నెం1 ర్యాంక్‌లో కొన‌సాగుతోంది. ఆ త‌ర్వాత ద‌క్షిణాఫ్రికా కెప్టెన్ లారా వోల్వార్డ్ట్‌, ఇంగ్లండ్ సార‌థి నాట్ స్కైవర్-బ్రంట్ 719 రేటింగ్ పాయింట్లతో రెండో స్దానంలో సంయుక్తంగా ఉన్నారు.

స్మృతి విష‌యానికి వ‌స్తే గ‌తేడాది అసాధ‌ర‌ణ ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిచింది. 2024 ఏడాదికి గానూ ఐసీసీ ఉమెన్స్ వ‌న్డే క్రికెటర్ ఆఫ్‌ది ఇయ‌ర్‌గా మంధాన నిలిచింది. గ‌తేడాదిలో 13 మ్యాచ్‌ల‌లో 57.86 సగటుతో 747 పరుగులు చేసింది. అందులో నాలుగు సెంచ‌రీలు ఉన్నాయి.

వ‌న్డేల్లో ఒకే క్యాలెండ‌ర్ ఈయ‌ర్‌లో అత్య‌ధిక సెంచ‌రీలు చేసిన మ‌హిళా క్రికెట‌ర్‌గా మంధాన రికార్డుల‌కెక్కింది. ఈ స్టార్ ఓపెన‌ర్ ప్ర‌స్తుతం ఇంగ్లండ్‌తో సిరీస్‌కు స‌న్న‌ద‌మ‌వుతోంది. వ‌న్డే వ‌ర‌ల్డ్‌క‌ప్‌-2025 స‌న్న‌హాకాల్లో భాగంగా ఈ సిరీస్ జ‌ర‌గ‌నుంది.

ఇంగ్లండ్ పర్యటనకు భారత మహిళా జట్టు..
భారత మహిళల వన్డే జట్టు: హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), ప్రతీకా రావల్, హర్లీన్ డియోల్, జెమీమా రోడ్రిగ్స్, రిచా ఘోష్ (వికెట్ కీపర్), యాస్తికా భాటియా, తేజల్ హస్బానిస్, దీప్తి శర్మ, స్నేహి రాణా, శ్రీ చరణి, శ్రీ చరణి, స్నేహి రాణా, అరుంధతి రెడ్డి, క్రాంతి గౌడ్, సయాలీ సత్ఘరే.

టీ20 సిరీస్‌కు భారత మహిళల జట్టు: హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), షఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, రిచా ఘోష్ (వికెట్ కీపర్), యాస్తికా భాటియా (వికెట్ కీపర్), హర్లీన్ డియోల్, దీప్తి  శర్మ, స్నేహ రానా, రాధా యాదవ్‌, , అమన్‌జోత్ కౌర్, అరుంధతి రెడ్డి, క్రాంతి గౌడ్, సయాలీ సత్ఘరే.
చదవండి: WI vs AUS: వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్‌.. ఆస్ట్రేలియా జ‌ట్టులో కీల‌క మార్పు

Videos

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)