Breaking News

ఆస్ట్రేలియా ప్రపంచ రికార్డు.. టీమిండియాను వెనక్కి నెట్టి టాప్‌లోకి!

Published on Thu, 01/30/2025 - 16:04

టీమిండియాతో బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీ సందర్భంగా ఫామ్‌లోకి వచ్చిన ఆస్ట్రేలియా వెటరన్‌ క్రికెటర్‌ స్టీవ్‌ స్మిత్‌(Steve Smith).. తన జోరును కొనసాగిస్తున్నాడు. మెల్‌బోర్న్‌ టెస్టులో భారీ శతకం(140) బాదిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్‌.. భారత్‌ ఆఖరిదైన సిడ్నీ టెస్టులో మొత్తంగా 37 పరుగులు చేసి.. 9999 పరుగుల వద్ద నిలిచాడు. 

తాజాగా శ్రీలంక(Australia vs Sri Lanka)తో తొలి టెస్టు సందర్భంగా టెస్టుల్లో పది వేల పరుగుల క్లబ్‌లో చేరాడు. తద్వారా ఆస్ట్రేలియా తరఫున ఈ ఘనత సాధించిన నాలుగో క్రికెటర్‌గా స్మిత్‌ చరిత్రకెక్కాడు. 

ఆస్ట్రేలియా ప్రపంచ రికార్డు
అతడి కంటే ముందు.. అలెన్‌ బోర్డర్‌, స్టీవ్‌ వా, రిక్కీ పాంటింగ్‌(Ricky Ponting) ఈ ఫీట్‌ నమోదు చేశారు. అయితే, తాజాగా స్మిత్‌ పదివేల టెస్టు పరుగుల మైలురాయిని అందుకున్న క్రమంలో ఆస్ట్రేలియా ప్రపంచ రికార్డును సొంతం చేసుకుంది. 

టెస్టు క్రికెట్‌లో ఒక దేశం తరఫున అత్యధికంగా నలుగురు ఆటగాళ్లు ఈ మైలురాయిని చేరుకోవడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఇంతకు ముందు ఈ జాబితాలో టీమిండియాతో కలిసి ఆసీస్‌ అగ్రస్థానంలో ఉండేది. ఇప్పుడు భారత్‌ను వెనక్కి నెట్టి వరల్డ్‌ రికార్డు సొంతం చేసుకుంది. 

కాగా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌(డబ్ల్యూటీసీ) 2023-25 సీజన్‌లో ఆసీస్‌ జట్టు ఇప్పటికే ఫైనల్‌కు చేరుకుంది. బోర్డర్‌ -గావస్కర్‌ ట్రోఫీలో భాగంగా ఐదు టెస్టుల సిరీస్‌లో టీమిండియాను 3-1తో ఓడించి టైటిల్‌ పోరుకు అర్హత సాధించింది. ఈ క్రమంలో డబ్ల్యూటీసీ తాజా ఎడిషన్‌లో ఆఖరిగా రెండు టెస్టుల సిరీస్‌ ఆడేందుకు కంగారూ జట్టు శ్రీలంకకు వచ్చింది.

ఖవాజా డబుల్‌ ధమా​కా
ఈ క్రమంలో గాలె అంతర్జాతీయ స్టేడియం వేదికగా ఇరుజట్ల మధ్య బుధవారం తొలి టెస్టు ఆరంభమైంది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. 

ఓపెనర్‌గా ప్రమోట్‌ అయిన ట్రవిస్‌ హెడ్‌ ధనాధన్‌ దంచికొట్టి అర్ధ శతకంతో మెరవగా.. మరో ఓపెనర్‌ ఉస్మాన్‌ ఖవాజా ఏకంగా డబుల్‌ సెంచరీతో చెలరేగాడు. హెడ్‌ 40 బంతుల్లో 57 పరుగులు సాధిస్తే.. ఖవాజా ఏకంగా 352 బంతులు ఎదుర్కొని 232 రన్స్‌ చేశాడు.

స్మిత్‌ రికార్డు సెంచరీ
మరోవైపు.. వన్‌డౌన్‌ బ్యాటర్‌ మార్నస్‌ లబుషేన్‌(20) తన వైఫల్యాన్ని కొనసాగించగా.. నాలుగో స్థానంలో వచ్చిన కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌ ఆకాశమే హద్దుగా దూసుకుపోయాడు. మొత్తంగా 251 బంతులు ఫేస్‌ చేసిన స్మిత్‌.. 12 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 141 పరుగులతో సత్తా చాటాడు. తద్వారా తన టెస్టు కెరీర్‌లో 35వ టెస్టు సెంచరీ నమోదు చేసిన 36 ఏళ్ల స్మిత్‌.. పలు రికార్డులు తన ఖాతాలో వేసుకున్నాడు.

సెంచరీల పరంగా రెండోస్థానంలోకి
‘ఫ్యాబ్‌ ఫోర్‌’లో ఒకరిగా గుర్తింపు పొందిన స్మిత్‌ టెస్టు సెంచరీల పరంగా రెండో స్థానానికి చేరుకున్నాడు. ఈ లిస్టులో ఇంగ్లండ్‌ టెస్టు దిగ్గజం జో రూట్‌ 36 శతకాలతో ప్రథమస్థానంలో ఉండగా.. న్యూజిలాండ్‌ స్టార్‌ కేన్‌ విలియమ్సన్‌ 33, టీమిండియా రన్‌మెషీన్‌ విరాట్‌ కోహ్లి 30 సెంచరీలతో స్మిత్‌ తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

అంతేకాదు.. ప్రస్తుతం యాక్టివ్‌గా ఉన్న క్రికెటర్లలో మూడు ఫార్మాట్లలో కలిపి శతకాల పరంగా నాలుగో స్థానానికి ఎగబాకాడు. అంతర్జాతీయ స్థాయిలో విరాట్‌ కోహ్లి 81 శతకాలతో టాప్‌(Active Cricketers)లో ఉండగా.. రూట్‌ 52, రోహిత్‌ శర్మ 48, స్మిత్‌ 47 సెంచరీలతో టాప్‌-4లో నిలిచారు.

ఇక శ్రీలంకతో మ్యాచ్‌లో ఖవాజా(232), స్మిత్‌(141)లతో పాటు జోష్‌ ఇంగ్లిస్‌ కూడా బ్యాట్‌ ఝులిపించాడు. 94 బంతుల్లోనే 102 పరుగులతో చెలరేగాడు. ఈ నేపథ్యంలో ఆరు వికెట్ల నష్టానికి  654 పరుగుల వద్ద ఆస్ట్రేలియా తమ తొలి ఇన్నింగ్స్‌ డిక్లేర్‌ చేసింది.

టెస్టుల్లో పది వేలకు పైగా పరుగులు చేసిన ఆటగాళ్లు- ఏ దేశం తరఫున ఎందరు?
👉ఆస్ట్రేలియా- నలుగురు- అలెన్‌ బోర్డర్‌, స్టీవ్‌ వా, రిక్కీ పాంటింగ్‌, స్టీవ్‌ స్మిత్‌
👉ఇండియా- ముగ్గురు- సునిల్‌ గావస్కర్‌, సచిన్‌ టెండుల్కర్‌, రాహుల్‌ ద్రవిడ్‌
👉ఇంగ్లండ్‌- ఇద్దరు- అలిస్టర్‌ కుక్‌, జో రూట్‌
👉శ్రీలంక- ఇద్దరు- కుమార్‌ సంగక్కర, మహేళ జయవర్దనే
👉వెస్టిండీస్‌- ఇద్దరు- బ్రియన్‌ లారా, శివ్‌నరైన్‌ చందర్‌పాల్‌
👉పాకిస్తాన్‌- ఒక్కరు- యూనిస్‌ ఖాన్‌
👉సౌతాఫ్రికా- ఒక్కరు- జాక్వెస్‌ కలిస్‌.

చదవండి: మరో డీఎస్పీ!.. పోలీస్‌ ఉద్యోగంలో చేరిన భారత క్రికెటర్‌

Videos

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)