Breaking News

హ్యాట్రిక్‌ తీసిన చెన్నై సూపర్‌ కింగ్స్‌ బౌలర్‌.. డకౌటైన పాండ్యా బ్రదర్స్‌

Published on Tue, 12/03/2024 - 17:51

సయ్యద్‌ ముస్తాక్‌ అలీ టీ20 టోర్నీలో కర్ణాటక ఆటగాడు, చెన్నై సూపర్‌ కింగ్స్‌ ప్లేయర్‌ శ్రేయస్‌ గోపాల్‌ హ్యాట్రిక్‌ వికెట్లతో చెలరేగాడు. బరోడాతో జరిగిన మ్యాచ్‌లో శ్రేయస్‌ గోపాల్‌ ఈ ఘనత సాధించాడు. గోపాల్‌ సాధించిన హ్యాట్రిక్‌లో టీమిండియా ఆటగాళ్లు హార్దిక్‌ పాండ్యా, కృనాల్‌ పాండ్యా వికెట్లు ఉన్నాయి. 

పాండ్యా సోదరులను గోపాల్‌ ఖాతా తెరవనీయకుండానే పెవిలియన్‌కు పంపాడు. వరుస బంతుల్లో గోపాల్‌.. హార్దిక్‌, కృనాల్‌ వికెట్లతో పాటు శాశ్వత్‌ రావత్‌ వికెట్‌ కూడా తీశాడు. ఈ మ్యాచ్‌లో గోపాల్‌ మొత్తం నాలుగు వికెట్లు తీశాడు. గోపాల్‌ బంతితో చెలరేగినప్పటికీ ఈ మ్యాచ్‌లో కర్ణాటక ఓటమిపాలైంది.

మ్యాచ్‌ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్‌ చేసిన కర్ణాటక నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. అభినవ్‌ మనోహర్‌ (34 బంతుల్లో 56; 6 సిక్సర్లు) అజేయమైన అర్ద సెంచరీతో రాణించాడు. స్మరన్‌ రవిచంద్రన్‌ (38), కృష్ణణ్‌ శ్రీజిత్‌ (22), శ్రేయస్‌ గోపాల్‌ (18), మనీశ్‌ పాండే (10) రెండంకెల స్కోర్లు చేశారు. కెప్టెన్‌ మయాంక్‌ అగర్వాల్‌ ఒక్క పరుగు మాత్రమే చేసి విఫలమయ్యాడు. బరోడా బౌలర్లలో కృనాల్‌ పాండ్యా, అతీత్‌ సేథ్‌ తలో 2 వికెట్లు పడగొట్టగా.. లుక్మన్‌ మేరీవాలా, ఆకాశ్‌ మహారాజ్‌ సింగ్‌ చెరో వికెట్‌ దక్కించుకున్నారు.

170 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన బరోడా.. శ్రేయస్‌ గోపాల్‌ (4-0-19-4) దెబ్బకు మధ్యలో ఇబ్బంది పడింది. 15 పరుగుల వ్యవధిలో గోపాల్‌ నాలుగు కీలకమైన వికెట్లు తీశాడు. అయితే శివాలిక్‌ శర్మ (22), విష్ణు సోలంకి (28 నాటౌట్‌), అతీత్‌ సేథ్‌ (6 నాటౌట్‌) కలిసి బరోడాను విజయతీరాలకు చేర్చారు. మరో ఏడు బంతులు మిగిలుండగానే బరోడా లక్ష్యాన్ని చేరుకుంది (6 వికెట్లు కోల్పోయి). బరోడా ఇన్నింగ్స్‌లో శాశ్వత్‌ రావత్‌ (63), భాను పూనియా (42) రాణించారు.

కాగా, ఇటీవల ముగిసిన ఐపీఎల్‌ 2025 మెగా వేలంలో శ్రేయస్‌ గోపాల్‌ను చెన్నై సూపర్‌ కింగ్స్‌ 30 లక్షల బేస్‌ ధరకు సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. గోపాల్‌ గతంలో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, ముంబై ఇండియన్స్‌, రాజస్థాన్‌ రాయల్స్‌ జట్లకు ప్రాతినిథ్యం వహించాడు. గోపాల్‌కు ఐపీఎల్‌లోనూ హ్యాట్రిక్‌ తీసిన ఘనత ఉంది. 

Videos

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?

ఏమమ్మా బాబు పాలన ఎలా ఉంది? కేతిరెడ్డి ఎదురుగా చంద్రబాబు పరువు తీసిన మహిళా

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)