Breaking News

తృటిలో సెంచరీ చేజార్చుకున్న రహానే.. 54 బంతుల్లో..!

Published on Thu, 12/05/2024 - 20:18

సయ్యద్‌ ముస్తాక్‌ అలీ టీ20 టోర్నీలో ముంబై జట్టు నాకౌట్‌ దశకు చేరింది. ఆంధ్రప్రదేశ్‌తో ఇవాళ (డిసెంబర్‌ 5) జరిగిన మ్యాచ్‌లో ముంబై 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆంధ్ర.. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 229 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. 

శ్రీకర్‌ భరత్‌ (93) ఏడు పరుగుల తేడాతో సెంచరీ మిస్‌ చేసుకోగా.. అశ్విన్‌ హెబ్బర్‌ (52), రికీ భుయ్‌ (68) అర్ద సెంచరీలతో రాణించారు. ముంబై బౌలర్లలో శార్దూల్‌ ఠాకూర్‌, మోహిత్‌ అవస్తి, షమ్స్‌ ములానీ, తనుశ్‌ కోటియన్‌ తలో వికెట్‌ పడగొట్టారు.

అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన ముంబై.. అజింక్య రహానే వీరోచిత ఇన్నింగ్స్‌ ఆడటంతో మరో 3 బంతులు మిగిలుండగానే విజయతీరాలకు చేరింది. రహానే  5 పరుగుల స్వల్ప తేడాతో సెంచరీ మిస్‌ చేసుకున్నాడు. ముంబై ఇన్నింగ్స్‌లో పృథ్వీ షా (34), శ్రేయస్‌ అయ్యర్‌ (25), శివమ్‌ దూబే (34) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడారు. 

ఆఖర్లో సుయాంశ్‌ షేడ్గే 8 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో అజేయమైన 30 పరుగులు చేసి ముంబైని విజయతీరాలు దాటించాడు. సయ్యద్‌ ముస్తాక్‌ అలీ టోర్నీ 2024 ఎడిషన్‌లో ఆంధ్రకు ఇది తొలి పరాజయం. 
 

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)