Breaking News

మహ్మద్‌ షమీ విధ్వంసం.. కేవలం 17 బంతుల్లోనే! వీడియో వైరల్‌

Published on Mon, 12/09/2024 - 13:42

స‌య్య‌ద్ ముస్తాక్ అలీ ట్రోఫీ-2024లో టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీ తన బ్యాట్‌ను ఝళిపించాడు. ఈ టోర్నీలో బెంగాల్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న షమీ.. చంఢీఘర్‌తో జరుగుతున్న ప్రీ క్వార్టర్ మ్యాచ్‌లో తుపాన్ ఇన్నింగ్స్ ఆడాడు. పదో స్ధానంలో బ్యాటింగ్‌కు వచ్చిన షమీ ప్రత్యర్ధి బౌలర్లకు చుక్కులు చూపించాడు.

అద్భుతమైన షాట్లతో ఈ వెటరన్ క్రికెటర్ అలరించాడు. కేవలం 17 బంతులు మాత్రమే ఎదుర్కొన్న షమీ.. 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 32 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ సోషల్ మీడియాలో షేర్ చేసింది. 

కాగా షమీ మెరుపు ఇన్నింగ్స్ ఫలితంగా తొలుత బ్యాటింగ్ చేసిన బెంగాల్ జట్టు 9 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. బెంగాల్ బ్యాటర్లలో షమీతో పాటు కరణ్ లాల్‌(33), ప్రదీప్త ప్రమాణిక్(30) పరుగులతో రాణించారు. చంఢీగర్‌ బౌలర్లలో జగిత్‌ సింగ్‌ 4 వికెట్లు పడగొట్టగా.. రాజ్‌ భా రెండు, నికిల్‌, అమ్రిత్‌, లాథర్‌ తలా వికెట్‌ సాధించారు.

టీమిండియాలోకి ఎంట్రీ ఎప్పుడంటే?
బోర్డ‌ర్ -గ‌వాస్క‌ర్ ట్రోఫీలో ఆఖ‌రి రెండు టెస్టుల‌కు ష‌మీ భార‌త జ‌ట్టుకు అందుబాటులోకి వ‌చ్చే అవ‌కాశ‌ముంది. తొలుత బ్రిస్బేన్ వేదిక‌గా జ‌రిగే మూడో టెస్టుకు ముందు ష‌మీ జ‌ట్టుతో క‌లుస్తాడ‌ని వార్త‌లు వినిపించాయి. 

కానీ భార‌త కెప్టెన్ రోహిత్ శ‌ర్మ మాత్రం ఆ వార్త‌ల‌ను కొట్టిపారేశాడు. ష‌మీ ప్ర‌స్తుతం బీసీసీఐ వైద్య బృందం పర్యవేక్షణలో ఉన్నాడని, బ్రిస్బేన్ టెస్టుకు అందుబాటులో ఉండకపోవచ్చని పరోక్షంగా హిట్‌మ్యాన్‌ స్పష్టం చేశాడు.
 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)