ఐదేళ్ల తర్వాత అంతర్జాతీయ టైటిల్‌.. చాంపియన్‌ సమీర్‌ వర్మ 

Published on Tue, 05/23/2023 - 12:24

Slovenia Open- 2023: ఐదేళ్ల తర్వాత భారత బ్యాడ్మింటన్‌ ప్లేయర్‌ సమీర్‌ వర్మ తన కెరీర్‌లో మరో అంతర్జాతీయ టైటిల్‌ను సాధించాడు. స్లొవేనియా ఓపెన్‌ ఇంటర్నేషనల్‌ చాలెంజ్‌ టోర్నీలో సమీర్‌ వర్మ విజేతగా నిలిచాడు. ఫైనల్లో సమీర్‌ వర్మ 21–18, 21–14తో సు లి యాంగ్‌ (చైనీస్‌ తైపీ)పై నెగ్గాడు. విజేతగా నిలిచిన సమీర్‌కు 1200 డాలర్ల (రూ. 99 వేలు) ప్రైజ్‌మనీ దక్కింది.

చివరిసారి సమీర్‌ వర్మ 2018లో సయ్యద్‌ మోదీ సూపర్‌–300 టోర్నీలో టైటిల్‌ సాధించాడు.  ఇక టోర్నీలో సిక్కి రెడ్డి- రోహన్‌ కపూర్‌ జోడీ మిక్స్‌డ్‌ డబుల్స్‌లో రజతం సాధించారు.

అర్జున్‌ ఖాతాలో మూడో ‘డ్రా’ 
షార్జా మాస్టర్స్‌ అంతర్జాతీయ చెస్‌ టోర్నీలో తెలంగాణ గ్రాండ్‌మాస్టర్‌ ఇరిగేశి అర్జున్‌ మూడో ‘డ్రా’ నమోదు చేశాడు. షాంట్‌ సర్గ్‌సియాన్‌ (అర్మేనియా)తో సోమవారం జరిగిన ఆరో రౌండ్‌ గేమ్‌ను అర్జున్‌ 34 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించాడు.

ఈ టోర్నీలో రెండు గేముల్లో గెలిచి, మూడు గేమ్‌లను ‘డ్రా’ చేసుకొని, మరో గేమ్‌లో ఓడిన అర్జున్‌ 3.5 పాయింట్లతో 18వ ర్యాంక్‌లో ఉన్నాడు. భారత్‌కే చెందిన గ్రాండ్‌మాస్టర్లు ప్రజ్ఞానంద, నిహాల్‌ సరీన్, ఆర్యన్‌ చోప్రా నాలుగు పాయింట్లతో ఉమ్మడిగా రెండో ర్యాంక్‌లో ఉన్నారు.    

మాజీ టాప్‌ ర్యాంక్‌ జోడీకి సాకేత్‌–యూకీ షాక్‌ 
పారిస్‌: లియోన్‌ –250 ఏటీపీ టెన్నిస్‌ టోర్నమెంట్‌లో సాకేత్‌ మైనేని–యూకీ బాంబ్రీ (భారత్‌) జోడీ సంచలన విజయంతో శుభారంభం చేసింది. పురుషుల డబుల్స్‌ తొలి రౌండ్‌లో సాకేత్‌–యూకీ ద్వయం 7–6 (7/4), 3–6, 10–8తో ‘సూపర్‌ టైబ్రేక్‌’లో ప్రపంచ మాజీ నంబర్‌వన్‌ జోడీ సెబాస్టియన్‌ కబాల్‌–రాబర్ట్‌ ఫరా (కొలంబియా) జోడీపై గెలిచి క్వార్టర్‌ ఫైనల్లోకి ప్రవేశించింది.

గంటా 53 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో సాకేత్, యూకీ రెండు ఏస్‌లు సంధించి, ఆరు డబుల్‌ ఫాల్ట్‌లు చేశారు. తమ ర్యాంకింగ్‌ ఆధారంగా వచ్చే వారం పారిస్‌లో మొదలయ్యే ఫ్రెంచ్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ పురుషుల డబుల్స్‌ మెయిన్‌ ‘డ్రా’కు సాకేత్, యూకీ అర్హత పొందారు.  

Videos

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)