Breaking News

SL vs WI 2nd T20I: విండీస్‌ను చిత్తు చేసిన శ్రీలంక

Published on Wed, 10/16/2024 - 09:55

వెస్టిండీస్‌ చేతిలో తొలి టీ20లో ఎదురైన పరాభవానికి శ్రీలంక ప్రతీకారం తీర్చుకుంది. దంబుల్లా వేదికగా మంగళవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసి నామమాత్రపు స్కోరుకే పరిమితమైనా.. బౌలర్ల విజృంభణ కారణంగా జయకేతనం ఎగురవేసింది. విండీస్‌ను 73 పరుగుల తేడాతో చిత్తు చేసి సిరీస్‌ను 1-1తో సమం చేసింది.

పరిమిత ఓవర్ల సిరీస్‌ కోసం
కాగా మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడేందుకు వెస్టిండీస్‌ జట్టు శ్రీలంక పర్యటనకు వచ్చింది. పొట్టి సిరీస్‌కు దంబుల్లా, వన్డే సిరీస్‌కు పల్లెకెలె ఆతిథ్యం ఇస్తున్నాయి. ఈ క్రమంలో ఆదివారం తొలి టీ20లో విండీస్‌ గెలవగా.. మంగళవారం శ్రీలంక జయభేరి మోగించింది.

నిసాంక హాఫ్‌ సెంచరీ
టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. ఓపెనర్‌,ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ పాతుమ్‌ నిసాంక (49 బంతుల్లో 54; 9 ఫోర్లు, ఒక సిక్సర్‌) హాఫ్‌ సెంచరీతో రాణించగా... కుశాల్‌ మెండిస్‌ (26; 2 ఫోర్లు, ఒక సిక్సర్‌), కుశాల్‌ పెరీరా (24; 3 ఫోర్లు, ఒక సిక్సర్‌) ఫర్వాలేదనిపించారు.

బౌలర్లు పడగొట్టేశారు
ఇక విండీస్‌ బౌలర్లలో రొమారియో షెఫర్డ్‌ రెండు వికెట్లు పడగొట్టాడు. అనంతరం లక్ష్యఛేదనలో వెస్టిండీస్‌ 16.1 ఓవర్లలో 89 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్‌ రావ్‌మన్‌ పావెల్‌ (17 బంతుల్లో 20; ఒక ఫోర్, ఒక సిక్స్‌) టాప్‌ స్కోరర్‌. బ్రాండన్‌ కింగ్‌ (5), ఎవిన్‌ లూయిస్‌ (7), ఆండ్రూ ఫ్లెచర్‌ (4), రోస్టన్‌ చేజ్‌ (0) పూర్తిగా విఫలమయ్యారు. 

శ్రీలంక బౌలర్లలో టీ20 అరంగేట్ర ఆటగాడు దునిత్‌ వెల్లలాగె 3, మహీశ్‌ తీక్షణ, అసలంక, హసరంగ తలా రెండు వికెట్లు పడగొట్టారు. సిరీస్‌లోని చివరిదైన మూడో టీ20 గురువారం జరుగనుంది.

చదవండి: T20 WC: భారత్‌ అవుట్‌!.. ఇంత చెత్తగా ఆడతారా?: పాక్‌ మాజీ కెప్టెన్‌

Videos

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు