Breaking News

చెలరేగిన పాక్‌ బ్యాటర్లు.. డబుల్‌ సెంచరీ, సెంచరీతో పాటు రెండు ఫిఫ్టీలు

Published on Thu, 07/27/2023 - 08:07

కొలంబో: శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో మూడో రోజు ఆట ముగిసే సమయానికి పాకిస్తాన్‌ 132 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 563 పరుగులు సాధించింది. ఓవర్‌నైట్‌ స్కోరు 178/2తో ఆట కొనసాగించిన పాకిస్తాన్‌ మూడు వికెట్లు చేజార్చుకొని 385 పరుగులు చేసింది. ఓపెనర్‌ అబ్దుల్లా షఫీఖ్‌ (201; 19 ఫోర్లు, 4 సిక్స్‌లు) డబుల్‌ సెంచరీ చేయగా... ఆఘా సల్మాన్‌ (132 బ్యాటింగ్‌; 15 ఫోర్లు, 1 సిక్స్‌) అజేయ సెంచరీ సాధించాడు. పాక్‌ ఇన్నింగ్స్‌లో షఫీక్‌,సల్మాన్‌తో పాటు షాన్‌ మసూద్‌ (51), సౌద్‌ షకీల్‌ (57) కూడా రాణించారు. ప్రస్తుతం పాక్‌ 397 పరుగుల ఆధిక్యంలో ఉంది. అంతకుముందు శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 166 పరుగులకు ఆలౌటైన విషయం తెలిసిందే. 

రికార్డు డబుల్‌ సెంచరీ బాదిన అబ్దుల్లా షఫీక్‌..
లంకతో రెండో టెస్ట్‌లో డబుల్‌ సెంచరీతో మెరిసిన పాక్‌ ఓపెనర్‌ అబ్దుల్లా షఫీక్‌.. ఈ ఘనత సాధించిన మూడో పాక్‌ యంగెస్ట్‌ క్రికెటర్‌గా రికార్డుల్లోకెక్కాడు. ఇంతకుముందు జావెద్‌ మియాందాద్‌, హనీఫ్‌ మొహమ్మద్‌లు అతి పిన్న వయసులో డబుల్‌ సాధించారు. అలాగే షఫీక్‌.. లంక గడ్డపై డబుల్‌ సెంచరీ బాదిన తొలి పాక్‌ ఓపెనర్‌గానూ రికార్డు నెలకొల్పాడు. 

Videos

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)