శ్రీలంకతో తొలి టెస్టు.. ప‌టిష్ట స్థితిలో న్యూజిలాండ్‌

Published on Thu, 09/19/2024 - 20:53

గాలే వేదిక‌గా శ్రీలంక‌తో జ‌రుగుతున్న తొలి టెస్టులో న్యూజిలాండ్ అద‌ర‌గొడుతోంది. రెండో రోజు ఆట‌ముగిసే స‌మ‌యానికి కివీస్ త‌మ తొలి ఇన్నింగ్స్‌లో 4 వికెట్ల న‌ష్టానికి 254 ప‌రుగులు చేసింది.  ప్ర‌స్తుతం న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో లంక కంటే ఇంకా 50 ప‌రుగులు వెన‌కంజ‌లో ఉంది.

క్రీజులో డార్లీ మిచెల్‌(41), బ్లాండెల్‌(18) ప‌రుగుల‌తో ఉన్నారు. కివీస్ బ్యాట‌ర్ల‌లో ఓపెన‌ర్ టామ్ లాథ‌మ్‌(70), కేన్ విలియ‌మ్స్‌(55) హాఫ్ సెంచ‌రీల‌తో రాణించారు. శ్రీలంక బౌల‌ర్ల‌లో ద‌నుంజ‌య డి సిల్వా 2 వికెట్లు ప‌డ‌గొట్ట‌గా.. మెండిస్‌, జ‌య‌సూర్య త‌లా వికెట్ సాధించారు. ఇక అంత‌కుముందు ఓవర్‌నైట్‌ స్కోర్‌ 302/7 వద్ద రెండో రోజు ఆటను ప్రారంభించిన శ్రీలంక.. మరో మూడు పరుగులు మాత్రమే జోడించి 305 ప‌రుగుల‌కు ఆలౌటైంది. 

లంక​ తొలి ఇన్నింగ్స్‌లో కమిందు మెండిస్‌ (114) అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. బ్లాక్‌ క్యాప్స్‌ బౌలర్లలో విలియమ్‌ ఓరూర్కీ 5 వికెట్లు పడగొట్టగా.. అజాజ్‌ పటేల్‌, గ్లెన్‌ ఫిలిప్స్‌ తలో రెండు, సౌథీ ఓ వికెట్‌ పడగొట్టారు.
చదవండి: IND vs BAN: చెపాక్‌లో చితక్కొట్టుడు.. అశ్విన్ సూప‌ర్ సెంచ‌రీ

Videos

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

Photos

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)