Breaking News

SL vs NZ: సెంచరీలతో కదం తొక్కిన శ్రీలంక బ్యాటర్లు

Published on Sat, 09/28/2024 - 10:00

Sri Lanka vs New Zealand, 2nd Test Day 2 Score Final Update: న్యూజిలాండ్‌తో గాలె వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో శ్రీలంక బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నారు. తొలిరోజు దినేశ్‌ చండీమల్‌ శతకం సాధించగా, రెండో రోజు ఆటలో కమిందు మెండిస్‌ (250 బంతుల్లో 182 నాటౌట్‌; 16 ఫోర్లు, 4 సిక్స్‌లు), కుశాల్‌ మెండిస్‌ (149 బంతుల్లో 106 నాటౌట్‌; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) అజేయ సెంచరీలతో కదంతొక్కారు. దీంతో ఆతిథ్య శ్రీలంక జట్టు తొలి ఇన్నింగ్స్‌ను 163.4 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 602 పరుగుల భారీస్కోరు వద్ద డిక్లేర్‌ చేసింది.

ఓవర్‌నైట్‌ స్కోరు 306/3తో శుక్రవారం రెండో రోజు ఆట కొనసాగించిన లంక బ్యాటర్లలో ఎంజెలో మాథ్యూస్‌ (185 బంతుల్లో 88; 7 ఫోర్లు) తన క్రితం రోజు స్కోరుకు 10 పరుగులు జోడించి నిష్క్రమించాడు. దీంతో తొలి సెషన్‌ ఆరంభంలోనే 328 పరుగుల వద్ద నాలుగో వికెట్‌ కూలింది. 

ఈ దశలో మరో ఓవర్‌నైట్‌ బ్యాటర్‌ కమిందు మెండిస్‌ కు జతయిన కెప్టెన్‌ ధనంజయ డిసిల్వా (80 బంతుల్లో 44; 3 ఫోర్లు, 1 సిక్స్‌) కుదురుగా ఆడటంతో పర్యాటక బౌలర్లకు మళ్లీ కష్టాలు తప్పలేదు. ఈ జోడీని విడగొట్టేందుకు చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. జట్టు స్కోరు 400 మైలురాయి దాటాక ఎట్టకేలకు తొలిసెషన్‌ ముగిసే దశలో ధనంజయను ఫిలిప్స్‌ పెవిలియన్‌ చేర్చాడు.  

అరుదైన రికార్డు
అతను అవుటైన 402 స్కోరువద్దే లంచ్‌ బ్రేక్‌కు వెళ్లారు. కుశాల్‌ మెండిస్‌ క్రీజులోకి రాగా... రెండో సెషన్‌ మొదలైన కాసేపటికే కమిందు మిండిస్‌ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. తద్వారా ఈ మిడిలార్డర్‌ బ్యాటర్‌ అరుదైన రికార్డును కొనసాగిస్తున్నాడు.

అరంగేట్రం చేసిన టెస్టు నుంచి ఇప్పటివరకు (తాజా 8వ టెస్టు) ప్రతి మ్యాచ్‌లో సెంచరీ, లేదంటే అర్ధసెంచరీ చేసిన బ్యాటర్‌గా ఘనతకెక్కాడు. మరోవైపు అతనికి జతయిన కుశాల్‌ కూడా కివీస్‌ బౌలర్లను దీటుగా ఎదుర్కోవడంతో రెండో సెషన్‌ అసాంతం కష్టపడినా వికెట్‌ తీయలేకపోయింది. 519/5 స్కోరు వద్ద రెండో సెషన్‌ ముగిసింది. 

602/5 వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌
ఆ తర్వాత మొదలైన మూడో సెషన్‌లోనూ ఈ జోడీ క్రీజు వదలకపోవడంతో పాటు పరుగుల్ని అవలీలగా సాధించింది. కమిందు 150 పరుగులు పూర్తి చేసుకోగా... కుశాల్‌ సెంచరీ సాధించాడు. జట్టు స్కోరు 602/5 వద్ద ఉండగా ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేశారు. కుశాల్, కమిందు ఇద్దరు అబేధ్యమైన ఆరో వికెట్‌కు సరిగ్గా 200 పరుగులు జోడించారు. 

గ్లెన్‌ ఫిలిప్స్‌ 3 వికెట్లు తీశాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్‌ మొదలుపెట్టిన న్యూజిలాండ్‌ ఆట నిలిచే సమయానికి 14 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 22 పరుగులు చేసింది. శ్రీలంక కంటే 580 పరుగులు వెనుకబడి ఉంది. ఇరు జట్ల మధ్య శనివారం మూడో రోజు మొదలైంది. కాగా తొలి టెస్టులోశ్రీలంక కివీస్‌ను 63 పరుగుల తేడాతో ఓడించిన విషయం తెలిసిందే.

చదవండి: అలా జరిగితే గంభీర్‌ విశ్వరూపం చూస్తారు: బంగ్లాదేశ్‌ క్రికెటర్‌

Videos

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

మళ్లీ ఢిల్లీకి రేవంత్.. మంత్రుల్లో కొత్త టెన్షన్!

10 ఏళ్లలో 82% పనులు..!వెలిగొండపై YSR-జగన్ కు ఘనత

Pedakakani Temple: గుడిలోకి వెళ్లకుండా ఆపారు ఇచ్చిపడేసిన అశోక్ బాబు

బాలిక ఎక్కడుంది..? 80 రోజులైనా ఆచూకీ లేదు పోలీసుల తీరుపై హైకోర్టు ఫైర్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు