Breaking News

కరుణరత్నే, కుశాల్‌ భారీ శతకాలు.. శ్రీలంక భారీ స్కోర్‌

Published on Sun, 04/16/2023 - 18:25

2 టెస్ట్‌ మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా గాలే​ వేదికగా ఐర్లాండ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌ తొలి ఇన్నింగ్స్‌లో ఆతిధ్య శ్రీలంక​ భారీ స్కోర్‌ దిశగా సాగుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక.. తొలి రోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్ల నష్టానికి 386 పరుగులు చేసింది. కెప్టెన్‌ దిముత్‌ కరుణరత్నే (179), వన్‌డౌన్‌ బ్యాటర్‌ కుశాల్‌ మెండిస్‌ (140) భారీ శతకాలతో విరుచుకుపడ్డారు. టెస్ట్‌ల్లో కరుణరత్నేకు ఇది 15వ సెంచరీ కాగా.. మెండిస్‌కు 8వది.

తొలి రోజు ఆట ముగిసే సమయానికి దినేశ్‌ చండీమాల్‌ (18), ప్రభాత్‌ జయసూర్య (12) క్రీజ్‌లో ఉన్నారు. నిషాన్‌ మదుష్క (29), ఏంజెలో మాథ్యూస్‌ (0) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. ఐర్లాండ్‌ బౌలర్లలో మార్క్‌ అడైర్‌, కర్టిస్‌ క్యాంపర్‌, జార్జ్‌ డాక్రెల్‌, బెంజమిన్‌ వైట్‌ తలో వికెట్‌ పడగొట్టారు. 

ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్‌లో సెంచరీ సాధించడం ద్వారా కరుణరత్నే.. శ్రీలంక దిగ్గజం సనత్‌ జయసూర్య, స్టార్‌ ఆల్‌రౌండర్‌ ఏంజెలో మాథ్యూస్‌ల రికార్డులను అధిగమించాడు. జయసూర్య, మాథ్యూస్‌లు తమ టెస్ట్‌ కెరీర్‌లలో 14 టెస్ట్‌ సెంచరీలు సాధించగా.. తాజాగా కరుణరత్నే వీరిని ఓవర్‌టేక్‌ చేసి లంక తరఫున అత్యధిక సెంచరీలు (15) చేసిన ఆటగాళ్ల జాబితాలో ఆరో స్థానానికి ఎగబాకాడు. ఈ జాబితాలో సంగక్కర (38) తొలి స్థానంలో ఉండగా.. జయవర్ధనే (34), అరవింద డిసిల్వ (20), తిలకరత్నే దిల్షన్‌ (16), మర్వన్‌ ఆటపట్టు (16) వరుసగా 2 నుంచి 5 స్థానాల్లో నిలిచారు.

Videos

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

భలే పడ్డారు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

రోడ్డుపై స్కూటర్ ఆపి.. హెల్మెట్ తో దాడి..! మాజీ ఎమ్మెల్యే రౌడీయిజం వైరల్

ప్లాన్ "B" లోడింగ్..! కొండా సురేఖ సంచలన పోస్ట్

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు