Breaking News

జయసూర్య రికార్డు బద్దలు కొట్టిన కరుణరత్నే

Published on Sun, 04/16/2023 - 15:06

శ్రీలంక కెప్టెన్‌ దిముత్‌ కరుణరత్నే టెస్ట్‌ల్లో 15వ సెంచరీ బాదాడు. స్వదేశంలో ఐర్లాండ్‌తో జరుగుతున్న మొదటి టెస్ట్‌లో కరుణరత్నే ఈ ఫీట్‌ను సాధించాడు. 139 బంతులను ఎదుర్కొన్న కరుణరత్నే..12 ఫోర్లు, సిక్సర్‌ సాయంతో సెంచరీ మార్కును అందుకున్నాడు. ఈ క్రమంలో అతను లంక దిగ్గజ బ్యాటర్‌ సనత్‌ జయసూర్య, స్టార్‌ ఆల్‌రౌండర్‌ ఏంజెలో మాథ్యూస్‌ల రికార్డులను అధిగమించాడు.

జయసూర్య, మాథ్యూస్‌లు తమ టెస్ట్‌ కెరీర్‌లలో 14 టెస్ట్‌ సెంచరీలు సాధించగా.. తాజాగా కరుణరత్నే వీరిని ఓవర్‌టేక్‌ చేసి లంక తరఫున అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో ఆరో స్థానానికి ఎగబాకాడు. ఈ జాబితాలో సంగక్కర (38) తొలి స్థానంలో ఉండగా.. జయవర్ధనే (34), అరవింద డిసిల్వ (20), తిలకరత్నే దిల్షన్‌ (16), మర్వన్‌ ఆటపట్టు (16) వరుసగా 2 నుంచి 5 స్థానాల్లో నిలిచారు. ఇప్పటివరకు కెరీర్‌లో 85 టెస్ట్‌లు ఆడిన కరుణరత్నే 15 సెంచరీలు, 34 అర్ధసెంచరీల సాయంతో 40.66 సగటున 6344 పరుగులు సాధించాడు. 

కాగా, కరుణరత్నే (114 నాటౌట్‌)కు జతగా కుశాల్‌ మెండిస్‌ (94 నాటౌట్‌) కూడా రాణించడంతో టీ సమయానికి శ్రీలంక వికెట్‌ నష్టానికి 245 పరుగులు చేసింది. శ్రీలంక కోల్పోయిన నిషాన్‌ మదుష్క (29) వికెట్‌ కర్టిస్‌ క్యాంపర్‌ ఖాతాలోకి వెళ్లింది. ఐర్లాండ్‌.. ప్రస్తుత లంక పర్యటనలో రెండు టెస్ట్‌ మ్యాచ్‌లు ఆడనుంది. 

Videos

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)