Breaking News

SL VS ENG: జయసూర్య రికార్డును సమం చేసిన నిస్సంక

Published on Fri, 10/27/2023 - 11:50

ప్రస్తుత ప్రపంచకప్‌లో భీకర ఫామ్‌లో ఉన్న శ్రీలంక ఓపెనర్‌ పథుమ్‌ నిస్సంక ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఇంగ్లండ్‌తో నిన్న జరిగిన మ్యాచ్‌లో అజేయ అర్ధశతకం సాధించిన నిస్సంక.. ప్రపంచకప్‌లో వరుసగా నాలుగో హాఫ్‌ సెంచరీ సాధించి, లంక దిగ్గజాలు సనత్‌ జయసూర్య, తిలకరత్నే దిల్షన్‌ల సరసన చేరాడు. జయసూర్య, దిల్షన్‌లు కూడా ప్రపంచకప్‌ టోర్నీల్లో వరుసగా నాలుగు అర్ధసెంచరీలు సాధించారు. జయసూర్య 2007లో.. దిల్షన్‌ 2011లో ఈ ఘనత సాధించారు. 

గిల్‌ రికార్డును కూడా సమం చేసిన నిస్సంక..
నిస్సంక.. ఇంగ్లండ్‌పై నిన్న సాధించిన హాఫ్‌ సెంచరీతో జయసూర్య, తిలకరత్నే దిల్షన్‌ల రికార్డును సమం చేయడంతో మరో రికార్డును కూడా సాధించాడు. నిస్సంక.. ఈ ఏడాది వన్డేల్లో అత్యధిక హాఫ్‌ సెంచరీలు సాధించిన ఆటగాడిగా టీమిండియా స్టార్‌ ఆటగాడు శుభ్‌మన్‌ గిల్‌తో కలిసి రికార్డును షేర్‌ చేసుకున్నాడు. గిల్‌, నిస్సంకలు ఈ ఏడాది వన్డేల్లో 11 హాఫ్‌ సెంచరీలు సాధించగా.. పాక్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజమ్‌ 10, టీమిండియా స్టార్లు విరాట్‌ కోహ్లి,రోహిత్‌ శర్మలు సంయుక్తంగా 9 హాఫ్‌ సెంచరీలు తమ ఖాతాలో వేసుకున్నారు.  

ఇదిలా ఉంటే, ఇంగ్లండ్‌తో నిన్న జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో తొలుత బౌలింగ్‌ చేసిన శ్రీలంక.. ఇంగ్లండ్‌ను 156 పరుగులకే కుప్పకూల్చగా.. శ్రీలంక ఆడుతూపాడుతూ లక్ష్యాన్ని ఛేదించింది. నిస్సంక 77 పరుగులు, సదీర సమరవిక్రమ 65 పరుగులతో అజేయంగా నిలిచి, లంకను విజయతీరాలకు (25.4 ఓవర్లలో 160/2) చేర్చారు. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ పతనాన్ని శాసించిన లహీరు కుమారకు (7-0-35-3) ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు లభించింది. 

Videos

రెండో టీ20లో వైభవ్ కు చాన్స్.. ఇషాన్ కిషన్ అవుట్

కర్నూలు జిల్లాలో కొనసాగుతున్న టీడిపీ గూండాల దౌర్జన్యాలు

ఉద్యోగులకు, పెన్షనర్లకు భారీ శుభవార్త.. దీపావళి కానుకగా డీఏ పెంపు..?

70 ఏళ్లపైనే ఉన్నావ్.. లుచ్చా పనులు ఆపేయ్! JCకి పెద్దారెడ్డి మాస్ వార్నింగ్

నా 25ఏళ్ల సన్నిహితంతో చెప్తున్న.. లోకేష్ వల్ల TDP భూస్థాపితం అవ్వడం తథ్యం

చూస్కుందాం...! నువ్వా... నేనా...

వృద్ధుడిని కూడా వదలరా? సొంత పార్టీ నేతలపై టీడీపీ గూండాల దాడులు

26నుంచి భారీ వర్షాలు

మహిళల జుట్టు పట్టుకోవడం, చీరలు లాగడం ఏ రకమైన పాలనకు నిదర్శనం?

దాడుల వెనుక టార్గెట్.. రెడ్డి వర్గం..! ఇంద్రనీల్ సంచలన నిజాలు

Photos

+5

సందడిగా 'ఆదర్శ కుటుంబం' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

క్యూట్ నాగదుర్గ.. త్వరలో శ్రీలతగా థియేటర్లలోకి (ఫొటోలు)

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం