Breaking News

ఏంజెలో మాథ్యూస్‌కు ఘనంగా వీడ్కోలు.. కోహ్లి ఇలాంటి గౌరవానికి అర్హుడు కాడా..?

Published on Tue, 06/17/2025 - 10:52

శ్రీలంక క్రికెట్‌ దిగ్గజాల్లో​ ఒకరైన ఏంజెలో మాథ్యూస్‌ కెరీర్‌లో తన చిట్టచివరి టెస్ట్‌ మ్యాచ్‌ ఆడేందుకు బరిలోకి దిగాడు. ఇవాల్టి నుంచి (జూన్‌ 17) శ్రీలంక స్వదేశంలో బంగ్లాదేశ్‌తో టెస్ట్‌ మ్యాచ్‌ ఆడుతుంది. ఈ మ్యాచ్‌ కెరీర్‌లో తనకు చివరిదని మాథ్యూస్‌ ఇదివరకే ప్రకటించాడు. 

మాథ్యూస్‌ సహచరుల నుంచి గార్డ్ ఆఫ్ ఆనర్ పొందాడు. ఆ సమయంలో మాథ్యూస్‌ ముఖంలో చిరునవ్వులు విరబూసాయి. లంక క్రికెట్‌కు ఎంతో చేసిన మాథ్యూస్‌కు చివరి టెస్ట్‌కు ముందు ఘనమైన వీడ్కోలు లభించింది. ఇది చూసి భారత క్రికెట్‌ దిగ్గజం విరాట్‌ కోహ్లి అభిమానులు బీసీసీఐపై మండిపడుతున్నారు. 

భారత క్రికెట్‌కు విశ్వవ్యాప్త ఖ్యాతి తెచ్చిన విరాట్‌ కనీసం ఇలాంటి వీడ్కోలు కూడా అర్హుడు కాడా అని ప్రశ్నిస్తున్నారు. విరాట్‌ ఇటీవలే టెస్ట్‌లకు రిటైర్మెంట్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. విరాట్‌ గౌరవార్దం బీసీసీఐ ఎలాంటి వీడ్కోలు సన్నాహాలు ప్లాన్‌ చేయకపోవడమే అతని అభిమానులకు ఆగ్రహం తెప్పిస్తుంది. 

లంక క్రికెట్‌ బోర్డును చూసైనా బీసీసీఐ నేర్చుకోవాలని విరాట్‌ ఫ్యాన్స్‌ చురకలంటిస్తున్నారు. కాగా, విరాట్‌ రిటైర్మెంట్‌ ప్రకటించాకే మాథ్యూస్‌ కూడా టెస్ట్‌లకు వీడ్కోలు పలుకుతున్నట్లు వెల్లడించాడు. విరాట్‌కు ముందు టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ కూడా టెస్ట్‌లకు ఆకస్మిక రిటైర్మెంట్‌ ప్రకటించాడు. 

38 ఏళ్ల ఏంజెలో మాథ్యూస్‌ శ్రీలంక తరఫున 118 టెస్ట్‌లు, 226 వన్డేలు, 90 టీ20లు ఆడాడు. పేస్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ అయిన మాథ్యూస్‌ మధ్యలో గాయాల కారణంగా బౌలింగ్‌కు వీడ్కోలు పలికి కేవలం బ్యాటర్‌గానే కొనసాగాడు. 

మాథ్యూస్‌ టెస్ట్‌ల్లో ఓ డబుల్‌ సెంచరీ, 16 సెంచరీలు, 45 హాఫ్‌ సెంచరీల సాయంతో 8167 పరుగులు చేశాడు. వన్డేల్లో 3 సెంచరీలు, 40 హాఫ్‌ సెంచరీల సాయంతో 5916 పరుగులు చేశాడు. టీ20ల్లో 6 హాఫ్‌ సెంచరీల సాయంతో 1416 పరుగులు చేశాడు. టెస్ట్‌ల్లో 33 వికెట్లు, వన్డేల్లో 126, టీ20ల్లో 45 వికెట్లు తీశాడు.

మ్యాచ్‌ విషయానికొస్తే.. డబ్ల్యూటీసీ 2025-27 సైకిల్‌లో భాగంగా జరుగుతున్న తొలి మ్యాచ్‌లో శ్రీలంక, బంగ్లాదేశ్‌ తలపడుతున్నాయి. రెండు మ్యాచ్‌ల ఈ సిరీస్‌ కోసం బంగ్లాదేశ్‌ శ్రీలంకలో పర్యటిస్తుంది. గాలే వేదికగా ఇవాళ ప్రారంభమైన మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. 

బంగ్లాదేశ్‌కు టాస్‌ గెలిచిన ఆనందం ఎంతోసేపు నిలబడలేదు. 5 పరుగులకే ఆ జట్టు ఓపెనర్‌ అనాముల్‌ హక్‌ (0) వికెట్‌ కోల్పోయింది. అశిత ఫెర్నాండో బౌలింగ్లో కుశాల్‌ మెండిస్‌కు క్యాచ్‌ ఇచ్చి అనాముల్‌ ఔటయ్యాడు. షద్మాన్‌ ఇస్లాం (8), మొమినుల్‌ హక్‌ (12) క్రీజ్‌లో ఉన్నారు. 9 ఓవర్ల తర్వాత బంగ్లాదేశ్‌ స్కోర్‌ 20/1గా ఉంది. ఈ సిరీస్‌తో బంగ్లాదేశ్‌ ఫుల్‌టైమ్‌ టెస్ట్‌ కెప్టెన్‌గా నజ్ముల్‌ హసన్‌ షాంటో జర్నీ మొదలవుతుంది.  

Videos

లోన్ కట్టలేదని వేధిస్తున్నారా? RBI రూల్స్ ఇవే!

దేనితో కొట్టాలి వీళ్లని.. పోలీసులే అభ్యర్థులను లాక్కెళుతున్నారు

సల్మాన్ ఖాన్‌తో పనిచేస్తే ఇదే గతి.. ఈ అనిల్ పండిత్ ఎవరు..?

PF ఉన్నవారందరికీ పెన్షన్ వస్తుందా? అసలు లెక్కలు తెలుసుకోండి..

వేటకొడవల్లితో TDP రౌడీలు దాడి.. బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

తిరుపతిలో దొంగల బీభత్సం 90 గ్రాముల బంగారం చోరీ!

టీడీపీ దాడులకు భయపడే ప్రసక్తేలేదు.. సజ్జల మాస్ వార్నింగ్

వైరల్ అవుతున్న వీడియో, దారుణం.. వెంటబడి మరి TDP గూండాల అరాచకం

టీడీపీ గూండాలు... కడపలో కత్తిపోట్లు.. పులివెందులలో కాల్పుల కలకలం

ఒక్కొక్కడి పేరు అడ్రస్ నోట్ చేస్తున్న.. సిగ్గు లేకుండా ఫోన్ ఆఫ్ చేసి పారిపోయారు

Photos

+5

యాంకర్ అనసూయ ఇంట్లో దసరా సెలబ్రేషన్ ఇలా (ఫొటోలు)

+5

ఫ్యాషన్ షో కోసం తృప్తి దిమ్రి క్రేజీ గ్లామర్ (ఫొటోలు)

+5

దసరా స్పెషల్.. చూడముచ్చటగా విజయ్-రష్మిక జంట (ఫొటోలు)

+5

నాకు హైదరాబాద్ ఎంతిష్టమో మీకు తెలుసు.. రకుల్ ప్రీత్ లేటెస్ట్ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో సందడిగా 'రామాయణ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)