Breaking News

SL VS AUS 2nd Test: ఉస్మాన్‌ ఖ్వాజా అరుదైన ఘనత.. తొలి ఆస్ట్రేలియన్‌గా రికార్డు

Published on Fri, 02/07/2025 - 14:26

ఆసీస్‌ (Australia) వెటరన్‌ ఓపెనర్‌ ఉస్మాన్‌ ఖ్వాజా (Usman Khawaja) అరుదైన ఘనత సాధించాడు. టెస్ట్‌ల్లో 35 ఏళ్ల తర్వాత 3000 పరుగులు సాధించిన తొలి ఆస్ట్రేలియన్‌ బ్యాటర్‌గా రికార్డు నెలకొల్పాడు. ఆసీస్‌ క్రికెట్‌ చరిత్రలో 35 అంతకుమించిన వయసులో ఎవరూ 3000 పరుగుల మార్కును తాకలేదు. ఖ్వాజాకు ముందు స్టీవ్‌ వా 2554 పరుగులు (53.30 సగటున) చేశాడు.

35 అంతకంటే ఎక్కువ వయసులో ఆసీస్‌ తరఫున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్లు..
- ఉస్మాన్‌ ఖ్వాజా-3016 (51.11)
- స్టీవ్‌ వా-2554 (53.30)
- అలెన్‌ బోర్డర్‌-2473 (42.63)
- మైక్‌ హస్సీ-2323 (50.50)
- క్రిస్‌ రోజర్స్‌-1996 (44.35)
- డాన్‌ బ్రాడ్‌మన్‌-1903 (105.72)

శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్ట్‌ సందర్భంగా ఖ్వాజా ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లో ఖ్వాజా 36 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 257 పరుగులకు ఆలౌటైంది. చండీమల్‌ (74), కుసాల్‌ మెండిస్‌ (85 నాటౌట్‌) అ‍ర్ద సెంచరీలతో రాణించి శ్రీలంకుకు గౌరవప్రదమైన స్కోర్‌ అందించారు. కెరీర్‌లో చివరి మ్యాచ్‌ ఆడుతున్న దిముత్‌ కరుణరత్నే 36 పరుగులకే ఔటయ్యాడు. 

రమేశ్‌ మెండిస్‌ (28), కమిందు మెండిస్‌ (13), పథుమ్‌ నిస్సంక (11) రెండంకెల స్కోర్లు చేశారు. ఆసీస్‌ బౌలర్లలో స్టార్క్‌, కుహ్నేమన్‌, లయోన్‌ తలో మూడు వికెట్లు పడగొట్టగా.. ట్రవిస్‌ హెడ్‌ ఓ వికెట్‌ దక్కించుకున్నాడు. ఈ మ్యాచ్‌లో మూడు వికెట్లు తీసిన అనంతరం లయోన్‌ ఎవరికీ సాధ్యంకాని ఓ ఘనతను సాధించాడు. ఆసియా గడ్డపై టెస్ట్‌ల్లో 150 వికెట్లు తీసిన నాన్‌ ఏషియన్‌ బౌలర్‌గా రికార్డు నెలకొల్పాడు.

శ్రీలంక ఆలౌటైన అనంతరం తొలి ఇన్నింగ్స్‌ ప్రారంభించిన ఆస్ట్రేలియా.. 43 ఓవర్ల అనంతరం 3 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది. ఓపెనర్లు ఉస్మాన్‌ ఖ్వాజా (36), ట్రవిస్‌ హెడ్‌ (21) ఓ మోస్తరు స్కోర్లు చేసి ఔట్‌ కాగా.. లబూషేన్‌ నాలుగు పరుగులకే పెవిలియన్‌కు చేరాడు. 

తొలి టెస్ట్‌లో సెంచరీతో కదంతొక్కిన స్టీవ్‌ స్మిత్‌ ఈ మ్యాచ్‌లోనూ సెంచరీ దిశగా పయనిస్తున్నాడు. స్మిత్‌ 69 పరుగులతో ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తున్నాడు. అతనికి జతగా అలెక్స్‌ క్యారీ (39) క్రీజ్‌లో ఉన్నాడు. లంక బౌలర్లలో నిషాన్‌ పెయిరిస్‌ 2 వికెట్లు పడగొట్టగా.. ప్రభాత్‌ జయసూర్య ఓ వికెట్‌ దక్కించుకున్నాడు.

తొలి టెస్ట్‌లో డబుల్‌ సెంచరీ
ఉస్మాన్‌ ఖ్వాజా తొలి టెస్ట్‌లో డబుల్‌ సెంచరీతో (232) కదంతొక్కాడు. తద్వారా ఆసీస్‌ తరఫున డాన్‌ బ్రాడ్‌మన్‌ తర్వాత అత్యంత లేటు వయసులో డబుల్‌ సెంచరీ చేసిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. ఖ్వాజా 38 ఏళ్ల 43 రోజుల వయసులో తన కెరీర్‌లో తొలి డబుల్‌ సెంచరీ సాధించాడు. తొలి టెస్ట్‌లో ఖ్వాజా డబుల్‌ సెంచరీ.. స్టీవ్‌ స్మిత్‌, జోష్‌ ఇంగ్లిస్‌ సెంచరీలతో మెరవడంతో ఆస్ట్రేలియా శ్రీలంకపై భారీ విజయం సాధించింది. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)