Breaking News

టెస్ట్‌ మ్యాచ్​ మధ్యలో కరోనాగా నిర్ధారణ.. బెంబేలెత్తిపోతున్న ఆటగాళ్లు

Published on Mon, 07/11/2022 - 14:58

Pathum Nissanka: శ్రీలంక-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న టెస్ట్‌ సిరీస్‌పై కరోనా మహమ్మారి పంజా విసురుతుంది. ఆతిధ్య శ్రీలంక జట్టుకు చెం‍దిన ఆటగాళ్లు వరుసగా వైరస్‌ బారిన పడుతున్నారు. రెండో టెస్ట్‌ మ్యాచ్‌ మధ్యలో ఓపెనర్‌ పథుమ్‌ నిస్సంకకు పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో కోవిడ్‌ బారిన పడిన లంక ఆటగాళ్ల సంఖ్య ఆరుకు చేరింది. మూడో రోజు ఆట మధ్యలో అస్వస్థతకు గురైన నిస్సంకకు ర్యాపిడ్ యాంటిజెన్ పరీక్ష చేయగా పాజిటివ్ రిజల్ట్ వచ్చింది.

దీంతో అతను మ్యాచ్ మధ్యలోనే వైదొలిగాడు. అతని స్థానంలో ఒషాడ ఫెర్నాండో కోవిడ్ సబ్‌స్టిట్యూట్‌గా జట్టులోకి వచ్చాడు. అంతకుముందు తొలి టెస్ట్‌ మ్యాచ్‌ సందర్భంగా లంక స్టార్‌ ఆటగాడు ఏంజలో మాథ్యూస్‌ సైతం ఇలానే మ్యాచ్‌ మధ్యలో కోవిడ్‌ బారిన పడ్డాడు.

ఆ తర్వాత జట్టు మొత్తానికి జరిపిన ఆర్టీపీసీఆర్‌ పరీక్షల్లో మరో నలుగురికి (ప్రవీణ్‌ జయవిక్రమ, ధనంజయ డిసిల్వ, జెఫ్రె వాండర్సే, అషిత ఫెర్నాండో) కోవిడ్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. శ్రీలంక జట్టులో వరుసగా కోవిడ్‌ కేసులు వెలుగుచూస్తున్నా ప్రత్యర్ధి ఆస్ట్రేలియా జట్టులో ఒక్క కేసు కూడా నమోదు కాకపోవడం విశేషం. 

ఇదిలా ఉంటే, కోవిడ్‌ కేసు వెలుగుచూసినా మ్యాచ్‌ యధాతథంగా కొనసాగుతుంది. నాలుగో రోజు ఆటలో సెంచరీ హీరో దినేశ్‌ చండీమాల్‌ మరింత రెచ్చిపోయి డబుల్‌ బాదడంతో శ్రీలంకకు 190 పరుగుల తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం లభించింది. 431/6 ఓవర్‌నైట్‌ స్కోర్‌తో నాలుగో రోజు ఆటను ప్రారంభించిన శ్రీలంక మరో 123 పరుగులు జోడించి 554 పరుగుల వద్ద ఆలౌటైంది. చండీమాల్‌ 206 పరుగులతో అజేయంగా నిలువగా.. కరుణరత్నే (86), కుశాల్‌ మెండిస్‌ (85), ఏంజలో మాథ్యూస్‌ (52), కమిందు మెండిస్‌ (61)లు లంక భారీ స్కోర్‌ సాధించడంలో తమవంతు పాత్ర పోషించారు.

ఆసీస్‌ బౌలర్లలో స్టార్క్‌ 4, స్వెప్సన్‌ 3, లయన్‌ 2, కమిన్స్‌ ఓ వికెట్‌ పడగొట్టారు. అంతకుముందు స్టీవ్‌ స్మిత్‌ (145 నాటౌట్‌), లబూషేన్‌ (104) శతకాలతో రాణించడంతో ఆసీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో 364 పరుగులకు ఆలౌటైంది. లంక అరంగేట్రం బౌలర్‌ ప్రభాత్‌ జయసూర్య  6 వికెట్లతో ఆసీస్‌ను తిప్పేశాడు.
చదవండి: WI Vs Ban: చేదు అనుభవాల నుంచి కోలుకుని.. బంగ్లాదేశ్‌ ఘన విజయం

Videos

అనంతపురం జిల్లాలో భారీ వర్షం

నందిగం సురేష్ అరెస్ట్

లిక్కర్ కేసు వెనక కుట్ర.. అడ్డంగా దొరికిన చంద్రబాబు

ఫ్యామిలీతో తిరుమలలో ఎంపీ గురుమూర్తి

పాతబస్తీ అగ్నిప్రమాద ఘటనపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి

ఎంటర్ ది డ్రాగన్.. కరోనా వచ్చేసింది

స్పిరిట్ లో కల్కి జోడి..

ఆ సినిమాకు సీక్వెల్ ప్లాన్ చేస్తున్న రవితేజ..!

కోపముంటే నాపై తీర్చుకో.. ప్రజల్ని ఎందుకు హింసిస్తావ్.. ఎమ్మెల్యే మాధవి రెడ్డిపై ఫైర్

కూటమి సర్కార్ నిర్లక్ష్యంతో మైనింగ్ లో పని చేసే కార్మికులు రోడ్డున పడ్డారు

Photos

+5

తెలంగాణ సచివాలయంలో అందగత్తెలు

+5

అనసూయ నూతన గృహప్రవేశం.. పూజా కార్యక్రమం (ఫోటోలు)

+5

పాతబస్తీలో పెను విషాదం.. అగ్నిప్రమాద దృశ్యాలు

+5

చెల్లి పెళ్లిలో నటి హరితేజ (ఫోటోలు)

+5

ఎంగేజ్ మెంట్ పార్టీలో 'కొత్త బంగారు లోకం' హీరోయిన్ (ఫొటోలు)

+5

బిగ్ బాస్ అశ్విని బర్త్ డే పార్టీలో పల్లవి ప్రశాంత్ (ఫొటోలు)

+5

చిరుకు జోడీగా నయన్.. ఫస్ట్ టైమ్ ఇలా (ఫొటోలు)

+5

Miss World 2025 : రామోజీఫిల్మ్‌ సిటీలో అందాల కాంతలు..! (ఫొటోలు)

+5

తల్లి కోరిక.. టక్కున తీర్చేసిన విజయ్ దేవరకొండ (ఫొటోలు)

+5

కేన్స్ లో సోనమ్ కపూర్.. అప్పట్లో ఇలా (ఫొటోలు)