Breaking News

ఒలింపిక్స్‌లో ఆరు క్రికెట్‌ జట్లు

Published on Fri, 04/11/2025 - 03:47

న్యూఢిల్లీ: లాస్‌ ఏంజెలిస్‌ వేదికగా 2028లో జరిగే ఒలింపిక్స్‌లో క్రికెట్‌ క్రీడాంశంపై మరింత స్పష్టత వచ్చింది. ఈ మెగా ఈవెంట్‌లో పురుషుల విభాగంలో ఆరు, మహిళల విభాగంలో ఆరు దేశాలకు చెందిన క్రికెట్‌ జట్లు బరిలోకి దిగుతాయని అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ (ఐఓసీ) ప్రకటించింది. టీమ్‌లో 15 మంది చొప్పున ఒక్కో విభాగంలో 90 మంది ఆటగాళ్లకు అవకాశం కల్పిస్తున్నారు. 1900లో జరిగిన పారిస్‌ ఒలింపిక్స్‌ తర్వాత 128 ఏళ్లకు మళ్లీ ఒలింపిక్స్‌లో క్రికెట్‌కు అవకాశం దక్కింది. 

మ్యాచ్‌లన్నీ టి20 ఫార్మాట్‌లోనే జరగనున్నాయి. అయితే ఏ ఆరు జట్లు పాల్గొంటాయనే విషయంపై మాత్రం ఇంకా నిర్ణయం తీసుకోలేదు. అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ)లో పూర్తి స్థాయి సభ్యదేశం కాకపోయినా... ఆతిథ్య జట్టుగా అమెరికాకు క్రికెట్‌ పోరులో అవకాశం దక్కడం ఖాయం. అంటే మరో ఐదు జట్లు మాత్రమే ఒలింపిక్స్‌కు అర్హత సాధించవచ్చు. 

ఏదైనా కటాఫ్‌ తేదీని నిర్ణయించి ఆ సమయంలో ప్రపంచ ర్యాంకింగ్స్‌లో టాప్‌–5లో ఉన్న జట్లను ఒలింపిక్స్‌ కోసం ఎంపిక చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరోవైపు వెస్టిండీస్‌ టీమ్‌ అర్హత సాధిస్తే ఏ దేశం బరిలోకి దిగుతుందనేది ఆసక్తికరం. క్రికెట్‌లో వెస్టిండీస్‌ పేరుతో కరీబియన్‌ ద్వీపంలోని వేర్వేరు దేశాలు కలిసి ఆడుతున్నాయి. 

సాధారణంగా ఒలింపిక్స్‌లో మాత్రం ఈ దేశాలన్నీ విడిగా పోటీ పడతాయి. 2022 బర్మింగ్‌హామ్‌ కామన్వెల్‌ క్రీడల్లో మహిళల క్రికెట్‌ పోటీలు నిర్వహించినప్పుడు బార్బడోస్‌ టీమ్‌ ప్రాతినిధ్యం వహించింది. విండీస్‌ రీజియన్‌ పోటీల్లో విజేతగా నిలవడంతో ఆ జట్టుకు అవకాశం లభించింది.  

మొత్తం 351 మెడల్‌ ఈవెంట్లు... 
లాస్‌ ఏంజెలిస్‌ ఒలింపిక్స్‌లో క్రికెట్‌తో పాటు మరో నాలుగు కొత్త క్రీడాంశాలకు చోటు లభించింది. బేస్‌బాల్‌/ సాఫ్ట్‌బాల్, ఫ్లాగ్‌ ఫుట్‌బాల్, స్క్వాష్, లాక్రోస్‌లను కొత్తగా చేర్చారు. పారిస్‌ ఒలింపిక్స్‌లో మొత్తం 329 మెడల్‌ ఈవెంట్లు ఉండగా... ఇప్పుడు మరో 22 జత కలవడంతో ఈ సంఖ్య 351కి చేరింది. స్విమ్మింగ్‌లో గరిష్టంగా 41 పతకాలు అందుబాటులో ఉన్నాయి. ఒలింపిక్స్‌ చరిత్రలో తొలిసారి పురుష అథ్లెట్ల సంఖ్య (5,167)తో పోలిస్తే ఎక్కువ సంఖ్యలో మహిళా అథ్లెట్లు (5,333) బరిలోకి దిగనున్నారు.

ఫుట్‌బాల్‌లో 12 పురుష జట్లు ఉంటే 16 మహిళా టీమ్‌లు ఉంటాయి. గోల్ఫ్, జిమ్నాస్టిక్స్, టేబుల్‌ టెన్నిస్, కాంపౌండ్‌ ఆర్చరీలలో తొలిసారి మిక్స్‌డ్‌ టీమ్‌లు ఉండబోతున్నాయి. అథ్లెటిక్స్‌లో కూడా మొదటిసారి 4్ఠ100 మిక్స్‌డ్‌ రిలే ఈవెంట్‌ను చేర్చారు. ఓవరాల్‌గా అథ్లెట్ల సంఖ్య మాత్రం ఎప్పటిలాగే 10,500 ఉండనుంది. 

Videos

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)