Breaking News

శుబ్‌మ‌న్ గిల్‌కు ఏమైంది.. ఇలా అయితే క‌ష్ట‌మే! వీడియో వైర‌ల్‌

Published on Sat, 05/04/2024 - 21:10

ఐపీఎల్‌-2024లో టీమిండియా యువ ఓపెనర్‌, గుజ‌రాత్ టైటాన్స్ కెప్టెన్ శుబ్‌మ‌న్ గిల్ త‌న పేల‌వ ఫామ్‌ను కొన‌సాగిస్తున్నాడు. ఈ ఏడాది సీజ‌న్ మొద‌టిలో ప‌ర్వాలేద‌న్పించిన గిల్‌.. సెకెండ్ హాఫ్‌లో మాత్రం దారుణ ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రుస్తున్నాడు. 

ఈ మెగా ఈవెంట్‌లో భాగంగా చిన్న‌స్వామి స్టేడియం వేదిక‌గా రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరుతో జ‌రుగుతున్న‌ మ్యాచ్‌లో గిల్ తీవ్ర నిరాశ‌ప‌రిచాడు. స్లో వికెట్‌పై ఆర్సీబీ బౌల‌ర్ల‌ను ఎదుర్కోవ‌డానికి గిల్ తీవ్ర ఇబ్బంది ప‌డ్డాడు. ఈ మ్యాచ్‌లో 7 బంతులు ఆడిన గిల్ కేవ‌లం 2 ప‌రుగులు మాత్ర‌మే చేసి ఔట‌య్యాడు.

మ‌హ్మ‌ద్ సిరాజ్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్ర‌య‌త్నించిన గిల్‌.. విజ‌య్‌కుమార్‌కు క్యాచ్ ఇచ్చి ఔట‌య్యాడు. గిల్ ఔట్ కాగానే ఆర్సీబీ ఆట‌గాళ్లు సంబ‌రాల్లో మునిగి తేలిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌లవుతోంది. ఇది చూసిన నెటిజ‌న్లు ఇండియ‌న్ క్రికెట్ ప్రిన్స్‌కు ఏమైంద‌ని కామెంట్లు చేస్తున్నారు. 

ఈ ఏడాది సీజ‌న్‌లో ఇప్ప‌టివ‌ర‌కు 11 మ్యాచ్‌లు ఆడిన గిల్‌..  32.22 స‌గ‌టుతో 322 ప‌రుగులు చేశాడు. ఇక ఇది ఇలా ఉండ‌గా.. టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌-2024కు భార‌త జ‌ట్టులో శుబ్‌మ‌న్ గిల్‌కు చోటు ద‌క్క‌లేదు. స్టాండ్‌బై జాబితాలో గిల్‌ను సెల‌క్ట‌ర్లు ఎంపిక చేశారు.

 

Videos

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు