Breaking News

అతడు బాగా అలిసిపోయాడు.. కొన్ని మ్యాచ్‌లకు రెస్ట్‌ ఇవ్వండి: భజ్జీ

Published on Fri, 04/12/2024 - 21:38

ఐపీఎల్‌-2024లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు స్టార్‌ పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌ తన స్ధాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతున్నాడు. ఈ ఏడాది సీజన్‌లో తొలి మ్యాచ్‌ నుంచే సిరాజ్‌ దారుణంగా విఫలమవుతున్నాడు. వికెట్లు విషయం పక్కన పెడితే రన్స్‌ను కూడా భారీగా సమర్పించుకుంటున్నాడు. గురువారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సైతం సిరాజ్‌ పూర్తిగా తేలిపోయాడు.

ముంబైతో మ్యాచ్‌లో 3 ఓవర్లు బౌలింగ్‌ చేసిన సిరాజ్‌ వికెట్‌ ఏమీ తీయకుండా ఏకంగా 37 పరుగులిచ్చాడు. ఈ ఏడాది సీజన్‌లో ఇప్పటివరకు 6 మ్యాచ్‌లు ఆడిన ఈ హైదరాబాదీ 57. 25 సగటుతో కేవలం 4 వికెట్లు మాత్రమే పడగొట్టాడు. ఈ నేపథ్యంలో మహ్మద్‌ సిరాజ్‌ను ఉద్దేశించి  భారత మాజీ స్పిన్నర్‌ హర్భజన్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సిరాజ్‌ బాగా ఆలిసిపోయాడని, అతడికి కొన్ని మ్యాచ్‌లకు విశ్రాంతి ఇవ్వాలని ఆర్సీబీ మెనెజ్‌మెంట్‌ను భజ్జీ సూచించాడు.

"మహ్మద్‌ సిరాజ్‌ మానసికంగా, ఫిజికల్‌గా బాగా ఆలసిపోయినట్లు కన్పిస్తున్నాడు. అతడికి ప్రస్తుతం విశ్రాంతి అవసరం. అతడు గత కొంత కాలంగా విశ్రాంతి లేకుండా క్రికెట్‌ ఆడుతున్నాడు. సిరాజ్‌ ఐపీఎల్‌కు ముందు ఇంగ్లండ్‌తో నాలుగు టెస్టు మ్యాచ్‌లు ఆడాడు. నేనే ఆర్సీబీ మేనేజ్‌మెంట్‌లో భాగమైతే అతడికి రెండు మ్యాచ్‌లకు విశ్రాంతి ఇస్తాను.

ఏమి జరుగుతుందో తను ఆర్ధం చేసుకోవడానికి అతడికి ఆ సమయం ఉపయోగపడుతోంది. సిరాజ్‌ అద్బుతమైన బౌలర్‌ అని మనకు తెలుసు. ఫార్మాట​్‌తో సంబంధం లేకుండా కొత్త బంతితో వికెట్లు తీయడం అతడి స్పెషల్‌. కచ్చితంగా ముంబైతో మ్యాచ్‌ అతడికి పీడ కలవంటింది. కానీ సిరాజ్‌కు రెస్ట్‌ ఇస్తే అద్భుతంగా కమ్‌బ్యాక్‌ ఇస్తాడని నేను నమ్ముతున్నాను. గతంలో నేను కూడా ఇటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నానని" స్టార్‌ స్పోర్ట్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో హర్భజన్ సింగ్ పేర్కొన్నాడు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)