Breaking News

గుకేశ్‌పైనే దృష్టి

Published on Mon, 08/18/2025 - 04:26

సెయింట్‌ లూయిస్‌ (అమెరికా): ప్రపంచ చాంపియన్, భారత గ్రాండ్‌మాస్టర్‌ దొమ్మరాజు గుకేశ్‌ తిరిగి క్లాసికల్‌ చెస్‌ పోటీల్లో తలపడేందుకు సిద్ధమయ్యాడు. గ్రాండ్‌ చెస్‌ టూర్‌లో భాగంగా ఐదో టోర్నీ అయిన సింక్‌ఫీల్డ్‌ కప్‌లో భారత్‌ తరఫున గుకేశ్‌తోపాటు ప్రజ్ఞానంద విజయమే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నారు. పదిమంది మేటి గ్రాండ్‌మాస్టర్ల మధ్య తొమ్మిది రౌండ్లపాటు ఈ టోర్నీ జరుగుతుంది. సోమవారం నుంచి ఇక్కడ జరిగే ఈ టోర్నీలో అమెరికా గ్రాండ్‌మాస్టర్లు ఫాబియానో కరువానా, వెస్లీ సో, లెవోన్‌ అరోనియన్, స్యామ్‌ సేవియన్‌లతో పాటు ఫ్రాన్స్‌కు చెందిన మాక్సిమి వాచియెర్‌ లాగ్రెవ్, అలీరెజా ఫిరూజా... పోలాండ్‌ స్టార్‌ జాన్‌ క్రిస్టోఫ్‌ డూడా... ఉజ్బెకిస్తాన్‌ గ్రాండ్‌మాస్టర్‌ నొదిర్బెక్‌ అబ్దుసత్తోరోవ్‌ కూడా పాల్గొంటున్నారు. 

అయితే ప్రపంచ నంబర్‌వన్, మాజీ ప్రపంచ చాంపియన్‌ మాగ్నస్‌ కార్ల్‌సన్‌ ఆడకపోవడమే టోర్నీకి ప్రధాన లోటు అని చెప్పొచ్చు. ఈ నార్వే గ్రాండ్‌మాస్టర్‌ క్లాసికల్‌ చెస్‌ను ఆస్వాదించలేకపోతున్నానని ఇదివరకే ఎన్నోసార్లు స్పష్టం చేశాడు. అందువల్లే ఈ టోర్నీకి దూరంగా ఉన్నాడు. అయితే చెస్‌ దిగ్గజం కార్ల్‌సన్‌ లేకపోయినప్పటికీ భారత ఆటగాళ్లకు ప్రధానంగా అమెరికా ఆటగాళ్లు ఆరోనియన్, కరువానా, అలీరెజా నుంచి గట్టిపోటీ తప్పదు. సెయింట్‌ లూయిస్‌లోనే జరిగిన గ్రాండ్‌ చెస్‌ టూర్‌ ర్యాపిడ్, బ్లిట్జ్‌ టోర్నీలో గుకేశ్‌ ఆశించినంతగా రాణించలేకపోయాడు. 

అయితే తనకు పట్టున్న క్లాసికల్‌ ఫార్మాట్‌లో సత్తా చాటుకోవడానికి గుకేశ్‌ రెడీగా ఉన్నాడు. ఈ టోర్నీ మొత్తం ప్రైజ్‌మనీ 3,50,000 డాలర్లు (రూ. 3 కోట్ల 6 లక్షలు). విజేతకు 1,00,000 డాలర్లు (రూ.87 లక్షల 51 వేలు) అందజేస్తారు. రన్నరప్‌గా నిలిచిన ప్లేయర్‌కు 65 వేల డాలర్లు (రూ. 56 లక్షల 88 వేలు), మూడో స్థానం పొందిన ప్లేయర్‌కు 48 వేల డాలర్లు (రూ. 42 లక్షలు) లభిస్తాయి.  

Videos

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)