Breaking News

ఆసియా టీమ్‌ బ్యాడ్మింటన్‌ పోటీలకు సింధు

Published on Fri, 12/12/2025 - 01:50

న్యూఢిల్లీ: వచ్చే ఏడాది జరిగే ఆసియా టీమ్‌ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌ పోటీలకు స్టార్‌ ఆటగాళ్లతో భారత్‌ సిద్ధమైంది. ఫిబ్రవరి 3 నుంచి 8వ తేదీ వరకు జరిగే ఈ మెగా ఈవెంట్‌లో పాల్గొనే భారత పురుషుల, మహిళల జట్లను భారత బ్యాడ్మింటన్‌ సంఘం (బాయ్‌) గురువారం ప్రకటించింది. రెండేళ్లకోసారి జరిగే ఈ పోటీల్లో మహిళల విభాగంలో భారత జట్టు డిఫెండింగ్‌ చాంపియన్‌కాగా... పురుషుల విభాగంలో టీమిండియా రెండుసార్లు కాంస్య పతకాలు సాధించింది. 

‘ర్యాంకింగ్, ప్రదర్శన, అనుభవం ఆధారంగా జట్లను ఎంపిక చేశాం. మహిళల జట్టును రెండుసార్లు ఒలింపిక్‌ పతక విజేత సింధు ముందుండి నడిపిస్తుంది’ అని ‘బాయ్‌’ ఒక ప్రకటనలో తెలిపింది. పురుషుల జట్టులో భారత నంబర్‌వన్, ప్రపంచ 13వ ర్యాంకర్‌ లక్ష్య సేన్‌తోపాటు ప్రపంచ మాజీ నంబర్‌వన్‌ కిడాంబి శ్రీకాంత్, రైజింగ్‌ స్టార్స్‌ ఆయుశ్‌ శెట్టి, హైదరాబాద్‌ ప్లేయర్‌ తరుణ్‌ మన్నేపల్లి ఉన్నారు. 

భారత మహిళల బ్యాడ్మింటన్‌ జట్టు: పీవీ సింధు, ఉన్నతి హుడా, తన్వీ శర్మ, రక్షిత శ్రీ, మాళవిక బన్సోద్, ట్రెసా జాలీ, పుల్లెల గాయత్రి, ప్రియా కొంజెంగ్‌బమ్, శ్రుతి మిశ్రా, తనీషా క్రాస్టో. 

భారత పురుషుల బ్యాడ్మింటన్‌ జట్టు: లక్ష్య సేన్, ఆయుశ్‌ శెట్టి, కిడాంబి శ్రీకాంత్, ప్రణయ్, తరుణ్‌ మన్నేపల్లి, సాతి్వక్‌ సాయిరాజ్, చిరాగ్‌ శెట్టి, పృథ్వీ కృష్ణమూర్తి రాయ్, సాయిప్రతీక్, హరిహరన్‌. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)