Breaking News

సౌతాఫ్రికా బౌలర్‌ సంచలనం.. ఏకంగా 1000 వికెట్లతో!

Published on Fri, 10/24/2025 - 11:06

సౌతాఫ్రికా స్పిన్న‌ర్ సైమ‌న్ హ‌ర్మ‌ర్ 36 ఏళ్ల వ‌య‌స్సులో స‌త్త‌చాటుతున్నాడు. రావల్పిండి వేదిక‌గా పాకిస్తాన్‌తో జ‌గిన  రెండో టెస్టులో హ‌ర్మ‌ర్ మ్యాచ్ విన్నింగ్ ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిచాడు. తొలి ఇన్నింగ్స్‌లో రెండు వికెట్లు ప‌డ‌గొట్టిన హ‌ర్మ‌ర్‌.. రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం బంతితో అద్భుతం చేశాడు. ఏకంగా 6 వికెట్లు ప‌డ‌గొట్టి పాక్ ఓట‌మిని శాసించాడు.

మొత్తంగా రెండు ఇన్నింగ్స్‌లు క‌లిపి 8 వికెట్ల‌ను త‌న ఖాతాలో వేసుకున్నాడు. ఈ క్ర‌మంలో సౌతాఫ్రికా వెట‌ర‌న్‌ ఓ అరుదైన ఘ‌నత‌ను త‌న పేరిట లిఖించుకున్నాడు.  ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌లో 1000 వి​కెట్లు పూర్తి చేసుకున్న నాలుగో దక్షిణాఫ్రికా బౌలర్‌గా హర్మెర్‌ నిలిచాడు.

ఇప్ప‌టివ‌ర‌కు త‌న ఫ‌స్ట్ క్లాస్ కెరీర్‌లో 234 మ్యాచ్‌లు ఆడిన హ‌ర్మెర్‌.. 1000 వికెట్లు ప‌డ‌గొట్టాడు. సౌతాఫ్రికా త‌ర‌పున ఫ‌స్ట్‌క్లాస్ క్రికెట్‌లో అత్య‌ధిక వికెట్లు ప‌డ‌గొట్టిన బౌల‌ర్‌గా దిగ్గ‌జం చార్లీ లెవెలిన్‌(1013) అగ్రస్ధానంలో కొనసాగుతుండగా.. తర్వాతి స్ధానాల్లో మైక్‌ ప్రాక్టర్‌(1417), అలెన్ డొనాల్డ్‌(1216) ఉన్నారు.

కాగా ఫస్ల్ క్రికెట్‌లో సంచలన ట్రాక్ రి​​కార్డు ఉన్న హర్మెర్‌.. జాతీయ జట్టుకు మాత్రం అతి తక్కువ మ్యాచ్‌లలో ప్రాతినిథ్యం వహించాడు. 2015లో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన అతడు ఇప్పటివరకు కేవలం 12 మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. హర్మెర్‌ సెలక్టర్లు ఎక్కువగా అవకాశాలు ఇవ్వలేదు. కానీ ఇటీవల కాలం‍లో ప్రోటీస్ టెస్టు జట్టులో రెగ్యూలర్ సభ్యునిగా కొనసాగుతున్నాడు. అతడి పేరిట 52 టెస్టు వికెట్లు ఉన్నాయి.

వ‌చ్చే నెల‌లో భార‌త ప‌ర్య‌ట‌న‌కు రానున్న సౌతాఫ్రికా జ‌ట్టులో భాగం కానున్నాడు. భార‌త్ పిచ్‌లు స్పిన్‌కు ఎక్కువ‌గా అనుకూలించే అవ‌కాశమున్నంద‌న అత‌డు ప్రోటీస్ జ‌ట్టుకు కీల‌కం కానున్నాడు.
చదవండి: IND vs AUS: అత‌డే ఉంటే కథ వేరేలా ఉండేది.. గంభీర్ ఇక‌నైనా మార‌వా?
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)