'ధోని వారసుడు అత‌డే.. వేలంలోకి వ‌స్తే రికార్డులు బద్దలవ్వాల్సిందే'

Published on Fri, 10/25/2024 - 20:00

ఐపీఎల్‌-2025కు సంబంధించిన ఆటగాళ్ల రిటైన్షన్స్​  జాబితాను సమర్పించేందుకు సమయం దగ్గర పడుతోంది.  అక్టోబర్ 31 సాయంత్రం ఐదు గంటల లోపు ఆయా ఫ్రాంచైజీలు వాళ్లు అట్టిపెట్టుకునే ప్లేయర్ల లిస్ట్​ను బీసీసీఐకు అందజేయాల్సి ఉంది.

అయితే ఇప్పటికే అన్ని ఫ్రాంచైజీలు తమ రిటైన్ చేసుకునే ఆటగాళ్లు లిస్ట్‌ను ఖారారు చేసుకున్నట్లు తెలుస్తోంది. కొన్ని ఫ్రాంచైజీలు సంచలన నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. అందులో ఒక ఫ్రాంచైజీ ఢిల్లీ క్యాపిటల్స్‌. ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యం తమ జట్టు కెప్టెన్ రిషబ్ పంత్‌ను మెగా వేలంలోకి విడిచిపెట్టాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. 

పంత్ కూడా ఇటీవలే చేసిన ఓ పోస్ట్ ఈ వార్తలకు మరింత ఊతమిచ్చాయి. ఐపీఎల్ వేలంలోకి వస్తే నేను అమ్ముడుపోతానా లేదా? ఒక‌వేళ తీసుకుంటే ఎంతకు అమ్ముడవుతాను’’ అని ఎక్స్‌లో పంత్ పోస్టు చేశాడు. దీంతో పంత్ ఢిల్లీని వీడేందుకు సిద్దమ‌య్యాడ‌ని అభిమానులు ఫిక్స్ అయిపోయారు. తాజాగా ఇదే విష‌యంపై న్యూజిలాండ్ మాజీ ఫాస్ట్ బౌల‌ర్ సైమన్ డౌల్ త‌న అభిప్రాయాల‌ను పంచుకున్నాడు.

"రిష‌బ్ పంత్ వేలంలోకి వ‌స్తే రికార్డులు బ్రేక్ అవ్వాల్సిందే. చెన్నై సూప‌ర్ కింగ్స్ అత‌డి కోసం ఎన్ని కోట్ల‌నైనా వెచ్చిస్తోంది. పంత్‌ను మ‌నం ఎల్లో జెర్సీలో చూడ‌బోతున్నాం. అదే విధంగా ధోని ఒక్క ఈ సీజ‌న్‌లో ఆడే అవ‌కాశ‌ముంది.

ఆ త‌ర్వాత ధోని నుంచి వికెట్ కీపింగ్ బాధ్య‌త‌లు పంత్ స్వీక‌రిస్తాడు అని సైమన్ డౌల్ జోస్యం చెప్పాడు. కాగా ఎప్ప‌టి నుంచో సీఎస్‌కేలోకి పంత్ వెళ్ల‌నున్నాడ‌న్న ప్ర‌చారం జ‌రుగుతోంది. ఏద‌మైన‌ప్ప‌టికి పంత్ ఢిల్లీలో కొన‌సాగుతాడా లేదా తెలియాలంటే అక్టోబర్ 31 వ‌ర‌కు వేచి ఉండాల్సిందే.
చదవండి: ఇదేం కెప్టెన్సీ రోహిత్‌?.. మాజీ హెడ్‌కోచ్‌ ఘాటు విమర్శలు

Videos

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)