Breaking News

'కోహ్లి, రోహిత్‌ కాదు.. వరల్డ్‌కప్‌ టాప్‌ రన్‌ స్కోరర్‌ అతడే'

Published on Sun, 10/08/2023 - 13:00

వన్డే ప్రపంచకప్‌-2023లో తొలి మ్యాచ్‌ ఆడేందుకు టీమిండియా సిద్దమైంది. ఆదివారం చెన్నై వేదికగా ఐదు సార్లు వరల్డ్‌ ఛాంపియన్‌ ఆస్ట్రేలియాతో భారత జట్టు తలపడనుంది. ఈ హైవోల్టేజ్‌ మ్యాచ్‌ కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ మ్యాచ్‌కు ముందు టీమిండియా యువ ఓపెనర్‌ శుబ్‌మన్‌ గిల్‌పై భారత మాజీ పేసర్‌ జహీర్‌ ఖాన్‌ ప్రశంసల వర్షం కురిపించాడు.

ఈ ఏడాది వరల్డ్‌కప్‌లో  అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా గిల్‌ నిలుస్తాడని జహీర్‌ ఖాన్‌ జోస్యం చెప్పాడు. కాగా గిల్‌ ప్రస్తుతం వన్డే క్రికెట్‌లో అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. తన గత 20 వన్డేల్లో ఏకంగా 1230 పరుగులు సాధించాడు. వన్డేల్లో అతడి సగటు ఏకంగా 72.35 ఉండటం గమనార్హం. ఈ ఏడాడి అతడు ఏకంగా ఆరు సెంచరీలు సాధించాడు.

ఈ నేపథ్యంలో జహీర్‌ ఇండియా టూడేతో మాట్లాడుతూ.. వన్డే క్రికెట్‌లో గిల్‌ అద్బుతమైన ప్రదర్శన కనబరుస్తున్నాడు. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు గిల్‌ అదరగొట్టాడు. అతడు ఈ ఫార్మాట్‌లో సెంచరీలు, డబుల్‌ సెంచరీ సాధించాడు. కచ్చితంగా ఈ  మెగా టోర్నీలో టాప్‌ రన్‌ స్కోరర్‌గా నిలుస్తాడని చెప్పుకొచ్చాడు. 

తొలి మ్యాచ్‌కు డౌటే..
కాగా గిల్‌ ప్రస్తుతం డెంగ్యూ జ్వరంతో బాధపడుతున్నాడు. తొలి మ్యాచ్‌కు అతడి అందుబాటుపై సందేహం నెలకొంది. అయితే అతడి ఆరోగ్యం కాస్త మెరుగపడినట్లు భారత హెడ్‌కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ తెలిపాడు.
చదవండి: చరిత్ర సృష్టించిన ఆస్ట్రేలియా బ్యాటర్‌.. ఏబీ డివిలియర్స్‌ ఫాస్టెస్ట్‌ సెంచరీ రికార్డు బద్దలు

Videos

ఇక దోమల శకానికి ముగింపు.. ఏఐతో అద్భుత ఆవిష్కరణ

ప్రొద్దుటూరులో హై టెన్షన్... రాచమల్లు, YSRCP నేతలపై లాఠీ ఛార్జ్

పులివెందులలో ఉద్రిక్తత.. అవినాష్ రెడ్డి సహా వందల మందిపై కేసులు

ప్రతి కార్యకర్త తిరగబడండి.. నిలబడండి.. YSRCP శ్రేణులకు జగన్ పిలుపు

కోలీవుడ్ డైరెక్టర్స్ వైపే చూస్తున్న టాలీవుడ్ టాప్ హీరోస్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

ఆళ్లగడ్డలో ఉద్రిక్తత.. ఇద్దరు ప్రపోజర్లు కిడ్నాప్

దీపావళి తర్వాత మూతపడనున్న పెట్రోల్ బంకులు? కారణం ఇదుకే..!

ప్రొద్దుటూరులో హై టెన్షన్.. రాచమల్లు, YSRCP నేతలపై లాఠీ ఛార్జ్

గుత్తిలో కౌన్సిలర్ల నామినేషన్లకు అడ్డంకులు.. శివంగిలా ఎదురెళ్లి ఇచ్చిపడేసిన నైరుతి రెడ్డి

Photos

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)