LSG Vs GT: చ‌రిత్ర సృష్టించిన శుబ్‌మన్ గిల్‌.. తొలి బ్యాటర్‌గా రికార్డు

Published on Sat, 04/12/2025 - 17:14

ఐపీఎల్‌-2025లో భాగంగా ఏక్నా స్టేడియం వేదిక‌గా ల‌క్నో సూప‌ర్ జెయింట్స్‌తో జ‌రుగుతున్న మ్యాచ్‌లో గుజ‌రాత్ టైటాన్స్ కెప్టెన్ శుబ్‌మ‌న్ గిల్ అద్బుత‌మైన హాఫ్ సెంచ‌రీతో మెరిశాడు. తొలుత కాస్త ఆచితూచి ఆడిన గిల్‌.. క్రీజులో కుదురుకున్నాక ఆకాశ‌మే హ‌ద్దుగా చెల‌రేగిపోయాడు. 

మ‌రో ఓపెన‌ర్ సాయిసుద‌ర్శ‌న్‌తో క‌లిసి స్కోర్ బోర్డును ప‌రుగులు పెట్టించాడు. త‌నదైన శైలిలో బౌండ‌రీలు బాదుతూ అభిమానుల‌ను ప్రిన్స్ అలరించాడు. ఈ క్ర‌మంలో గిల్ కేవ‌లం 31 బంతుల్లోనే ఆర్ధ శత‌కాన్ని అందుకున్నాడు. 

ఓవ‌రాల్‌గా 38 బంతులు ఎదుర్కొన్న గిల్‌.. 6 ఫోర్లు, ఒక సిక్స‌ర్‌తో 60 ప‌రుగులు చేసి ఔట‌య్యాడు. ఈ మ్యాచ్‌లో హాఫ్ సెంచ‌రీతో చెల‌రేగిన గిల్ ఓ అరుదైన ఘ‌న‌తను త‌న పేరిట లిఖించుకున్నాడు. ఐపీఎల్‌లో గుజ‌రాత్ త‌ర‌పున 2000 ప‌రుగులు పూర్తి చేసుకున్న తొలి బ్యాట‌ర్‌గా గిల్ రికార్డుల‌కెక్కాడు. 

శుబ్‌మ‌న్ 53 ప‌రుగుల వ్య‌క్తిగ‌త స్కోర్ వ‌ద్ద ఈ ఫీట్‌ను అందుకున్నాడు. ఓవరాల్‌గా ఐపీఎల్‌లో ఇప్పటివరకు 109 మ్యాచ్‌లు ఆడిన గిల్ 3424 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్‌లలో 22 హాఫ్ సెంచరీలు, నాలుగు శతకాలు ఉన్నాయి. ఇక ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి మొద‌ట బ్యాటింగ్ చేసిన గుజ‌రాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 6 వికెట్ల న‌ష్టానికి 180 ప‌రుగులు చేసింది. 

గుజరాత్ బ్యాట‌ర్ల‌లో గిల్‌తో పాటు సాయిసుద‌ర్శ‌న్‌(56), ష‌ర్ఫెన్ రూథ‌ర్ ఫ‌ర్డ్‌(22) ప‌రుగుల‌తో రాణించారు. ల‌క్నో బౌల‌ర్ల‌లో శార్ధూల్ ఠాకూర్‌, బిష్ణోయ్ త‌లా రెండు వికెట్లు సాధించ‌గా.. దిగ్వేష్ సింగ్‌, అవేష్ ఖాన్ చెరో వికెట్ సాధించారు.
చ‌ద‌వండి: LSG VS GT: మిచెల్‌ మార్ష్‌ ఎందుకు ఆడటం లేదు.. ఈ హిమ్మత్‌ సింగ్‌ ఎవరు..?

Videos

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)