Breaking News

ఓడినా గర్వంగా ఉంది.. అదే మా కొంప‌ముంచింది: టీమిండియా కెప్టెన్‌

Published on Mon, 07/14/2025 - 22:42

లార్డ్స్ వేదిక‌గా ఇంగ్లండ్‌తో జ‌రిగిన మూడో టెస్టులో 22 ప‌రుగుల తేడాతో టీమిండియా ప‌రాజ‌యం పాలైంది. 193 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన భార‌త్ ఆఖ‌రి వ‌ర‌కు పోరాడి ఓట‌మి పాలైంది. ల‌క్ష్య చేధ‌నలో 170 ప‌రుగుల‌కు టీమిండియా ఆలౌటైంది. స్టార్ ఆల్‌రౌండ‌ర్ ర‌వీంద్ర జ‌డేజా(181 బంతుల్లో 61) విరోచిత పోరాటం చేశాడు.

టాప‌ర్డ‌ర్ విఫ‌లం కావ‌డంతో భార‌త్ ల‌క్ష్యాన్ని చేధించ‌లేక‌పోయింది. శుబ్‌మ‌న్ గిల్‌(6), య‌శ‌స్వి జైశ్వాల్‌(0), క‌రుణ్ నాయ‌ర్‌(14) తీవ్ర నిరాశపరిచారు.  ఇంగ్లండ్‌ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్‌, కెప్టెన్ బెన్ స్టోక్స్ త‌లా మూడు వికెట్లు ప‌డ‌గొట్టి గిల్ సేన ప‌త‌నాన్ని శాసించారు.

వీరిద్దరితో పాటు కార్స్‌ రెండు, బషీర్‌, వోక్స్‌ తలా వికెట్‌ సాధించారు. ఈ హార్ట్‌బ్రేకింగ్ ఓటమిపై మ్యాచ్ అనంతరం టీమిండియా కెప్టెన్ శుబ్‌మన్ గిల్ స్పందించాడు. ఆఖరి వరకు పోరాడిన తమ ఆటగాళ్లను గిల్ అభినందించాడు.

"ఈ మ్యాచ్‌లో ఓడినా.. చాలా గర్వంగా ఉంది. మేము గెలుపు కోసం చివరి సెషన్‌, చివరి వికెట్ వరకు ప్రయత్నించాము. కానీ దురదృష్టవశాత్తూ మేము లక్ష్యాన్ని చేరుకోలేకపోయాము. అయితే చేతిలో చాలా వికెట్ల ఉండడంతో టార్గెట్‌ను ఈజీగా చేజ్ చేస్తామని భావించాను. కానీ ఇంగ్లండ్ బౌలర్లు మాత్రం మాపై పైచేయి సాధిస్తూ వచ్చారు.

దీంతో టాపర్డర్‌లో 50 పరుగుల భాగస్వామ్యాలు ఒకట్రెండు వచ్చి ఉంటే బాగుండేది అనుకున్నాము. కానీ మేము అలా చేయలేకపోవడంతోనే ఓటమి చవిచూశాము. వారు మా కంటే బాగా ఆడారు. అయితే జడేజా క్రీజులో ఉండడంతో మేము గెలుస్తామన్న నమ్మకం నాకు ఉండేది. అతడి చాలా అనుభవం ఉంది.

అందుకే అతడికి డ్రెస్సింగ్ రూమ్ నుంచి ఎటువంటి సందేశం ఇవ్వలేదు. టెయిలాండర్లతో కలిసి అతడు అద్బుతంగా బ్యాటింగ్ చేశాడు. మా టెయిలాండర్లు(బుమ్రా, సిరాజ్‌) సైతం అతడికి సహకరించారు. కానీ ఆఖరికి మ్యాచ్‌ను ఫినిష్ చేయలేకపోయాము. తొలి ఇన్నింగ్స్‌లో పంత్ రనౌట్ ఆటను మలుపు తిప్పింది. 

ఒకానొక సమయంలో మొదటి ఇన్నింగ్స్‌లో మాకు 50 నుంచి 60 పరుగుల ఆధిక్యం లభిస్తుందని మేము అనుకున్నాము. కానీ పంత్ ఔట్ కావడంతో అంతా తారుమారైంది. ఈ పిచ్‌లో 150-200 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడం అంత సులభం కాదని మాకు తెలుసు. అందుకే మొదటి ఇన్నింగ్స్‌లో ఆధిక్యం పొందాలని భావించాము. 

కానీ మేము అనుకున్నది జరగలేదు. పరిస్థితులు చాలా  త్వరగా మారిపోయాయి. నాలుగో రోజు ఆటలో చివరి సెషన్‌లో మేము కొంచెం మెరుగ్గా ఆడి వికెట్లు కోల్పోకపోయింటే పరిస్థితి మరోవిధంగా ఉండేది. చివరి రోజు ఆటలో ఇంగ్లండ్ సరైన ప్రణాళికలతో బరిలోకి దిగింది.

చివరి రోజు మాకు ఒక 50 పరుగుల భాగస్వామ్యం వచ్చి ఉన్నా గెలిచే వాళ్లం. మిగిలిన మ్యాచ్‌లలో మా తప్పిదాలను సరిదిద్దుకుంటాము. నాలుగో టెస్టుకు బుమ్రా అందుబాటుపై త్వరలోనే అప్‌డేట్ ఇస్తామని" గిల్ పోస్ట్ మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో పేర్కొన్నాడు.

Videos

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

మిథున్ రెడ్డి ని కాపాడటానికి గాల్లోకి గన్ మెన్ కాల్పులు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)