Breaking News

కలలో కూడా ఊహించలేదు

Published on Mon, 06/16/2025 - 02:42

లండన్‌: టీమిండియా సారథ్య బాధ్యతలు నిర్వర్తించే అవకాశం లభిస్తుందని కలలో కూడా ఊహించలేదని భారత టెస్టు జట్టు కొత్త కెప్టెన్‌ శుబ్‌మన్‌ గిల్‌ అన్నాడు. పేస్‌ తురుపుముక్క బుమ్రా అందుబాటుపై ముందుగానే చెప్పడం కుదరదన్నాడు. జట్టులోని ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండేందుకు... యథేచ్చగా ఆడేందుకు తగిన లక్ష్యాలను నిర్దేశించుకుంటామన్నాడు. స్టార్, వెటరన్‌ బ్యాటర్లు రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లిలు సంప్రదాయ ఫార్మాట్‌కు వీడ్కోలు పలకడంతో గిల్‌కు జట్టు పగ్గాలు అప్పగించారు. 

ఇన్నాళ్లు ఓపెనింగ్‌ సవాల్‌ను ఎదుర్కొన్న శుబ్‌మన్‌ ఇప్పుడు మొదటిసారి ఓపెనింగ్‌తోపాటు సారథ్య పరీక్షకూ ఇంగ్లండ్‌కు వచ్చాడు. 2007లో టీమిండియా ఇంగ్లండ్‌ గడ్డపై టెస్టు సిరీస్‌ నెగ్గింది. తర్వాత చాలాసార్లు పర్యటించినా విజయం మాత్రం దక్కలేదు. ఇప్పుడు గిల్‌ నేతృత్వంలోని భారత్‌ ఈ నిరీక్షణకు తెరదించేందుకు ఐదు టెస్టుల సిరీస్‌లో రాణించడంపై దృష్టి సారించింది. ఇంగ్లండ్‌లోని స్కై స్పోర్ట్స్‌ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు అంశాలపై గిల్‌ వెలిబుచ్చిన అభిప్రాయాలు అతని మాటల్లోనే...  

ఆటగాళ్లపై ఒత్తిడి లేకుండా... 
ఆటగాళ్లపై ఒత్తిడి లేకుండా జట్టు సంస్కృతిని మార్చాలనుకుంటున్నాను. సురక్షితమైన వాతావరణం కల్పించడం ద్వారా ఆ ఆటగాడు యథేచ్చగా ఆడే అవకాశం కల్పిస్తే... అతని పూర్తిస్థాయి సామర్థ్యం బయటపడుతుంది. ఓ నాయకుడు జట్టుకు చేయాల్సింది అదేనని నేను గట్టిగా విశ్వసిస్తున్నాను. ఇది అంతసులువు కాదని నాకూ తెలుసు. అయితే ఆ దిశగా నా ప్రణాళికలుంటాయి. 

కెప్టెన్‌ రోహిత్‌ శర్మ బ్యాటింగ్‌లో దూకుడుగా ఉన్నట్లే జట్టును నడిపించే విషయంలోనే అంతే పట్టుదలను ప్రదర్శిస్తాడు. సిరీస్‌ లేదంటే పర్యటనలో ఆటగాళ్ల నుంచి తనకు ఏం కావాలనేది స్పష్టం చేస్తాడు. ముగిసిన తర్వాత సమీక్షలోనూ ఇదే పంథా అనుసరిస్తాడు. ఇది సరైన మార్గనిర్దేశనమని నేను భావిస్తున్నా. దూకుడైన సారథిగా కోహ్లి మార్కు కూడా జట్టుపై ఉంది. ఇద్దరి నుంచి నేనెంతో నేర్చుకున్నాను. 

అంచనాలనేవి సహజం 
చీఫ్‌ సెలక్టర్‌ అజిత్‌ అగార్కర్, హెడ్‌ కోచ్‌ గౌతం గంభీర్‌లు నాపై అసాధారణ ఒత్తిడిని పెట్టలేదు. అమితమైన అంచనాలను పెంచలేదు. అయితే ఓ ఆటగాడిగా, కెప్టెన్‌గా నాపై సహజంగానే కొన్ని అంచనాలయితే తప్పకుండా ఉంటాయి. ఇది కాదనలేని సత్యం. వాటిని అందుకునేందుకు నా వంతు ప్రయత్నం చేస్తా. నా ఆటతీరుపై మా నాన్న ప్రభావం తప్పకుండా ఉంటుంది. 

నాలాగే తను కూడా భారత టెస్టు జట్టుకు కెప్టెన్‌ను అవుతానని ఏనాడూ ఊహించలేదు. ఆయన కూడా నాలాగే టీమిండియాకు ఆడటం, జట్టును గెలిపించడంలో కీలకపాత్ర పోషించాలనే ఆశలే పెట్టుకున్నాడు. కెప్టెన్సీపై నాతో సంప్రదింపులు జరుగుతున్నప్పుడే నాన్న నాకు ఫోన్‌ చేసి ఆడిగారు. కానీ నేను మాత్రం అధికారికంగా నియమించాకే నాన్నతో ఆ  విషయాన్ని పంచుకున్నాను. 

గంభీర్‌ శైలిని అందిపుచ్చుకోవడం... 
ఐపీఎల్‌లోనే కోచ్‌ గంభీర్‌ శైలికి అలవాటు పడ్డాను. కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు నేను ఆడినపుడు గంభీర్‌ మెంటార్‌గా ఉన్నాడు. కాబట్టి అతని శిక్షణ శైలిపై అవగాహన ఉంది. ఇప్పుడు ఓ జాతీయ జట్టుకు అతను హెడ్‌ కోచ్‌ కాబట్టి ఎంతబాగా అతని శైలి తెలిసున్నప్పటికీ ఇంకాస్త జాగ్రత్తగా అనుసరించాల్సి ఉంటుంది. 

జట్టు కోసం అంకితభావం, నిబద్ధతతో పనిచేసే గంభీర్‌ ఆటగాళ్లకు ఎప్పుడు అందుబాటులో ఉంటాడు. జట్టు ముందున్న లక్ష్యాలు, ఆటగాళ్లు అందుకోవాల్సిన అంచనాలు ముందే స్పషీ్టకరిస్తాడు. జట్టుకు ఏ సమయంలో ఏం కావాలనేది ఓ సానుకూల దృక్పథంతో ఆటగాళ్ల మానసిక స్థయిర్యాన్ని పెంచుతాడు.  

బుమ్రా అందుబాటుపై... 
పేసర్‌ బుమ్రాపై పని భారాన్ని తగ్గించేందుకు అన్ని టెస్టులకు అందుబాటులో ఉండటం లేదు. అయితే ఏ, ఏ మ్యాచ్‌లు ఆడతాడనేది ఇప్పుడే వెల్లడించడం సాధ్యం కాదు. ఐదు టెస్టుల పూర్తిస్థాయి సిరీస్‌లో పరిస్థితులు, పలు అంశాలను బట్టి తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకానీ అతను ఈ మ్యాచ్‌ ఆడడు. వచ్చే మ్యాచ్‌ ఆడతాడు అని చెప్పలేం. ఇంగ్లండ్‌ ‘బజ్‌బాల్‌ క్రికెట్‌’ను ఎదుర్కొనేందుకు ప్రణాళికలేం లేవు. పరిస్థితులను బట్టే జట్టు ఎత్తుగడలు అమలవుతాయి. దూకుడు ప్రతీసారి ఫలించదు. ఆ విషయం నాకు తెలుసు. 

Videos

విద్యా శాఖ కమిషనర్ Vs ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి

ఫస్ట్ డేనే ఇంట్లో రణరంగం.. నాయకుడి కోసం పెద్ద గొడవ! రెచ్చిపోయిన రోహిత్..

రామానందనాకు బెయిల్ వస్తుందా..?

రవితేజ రేంజికి తగ్గట్టే రెమ్యునరేషన్ పారితోషికంలో మాత్రం తగ్గేదేలే!

Viral: కదులుతున్న రైలు ఎక్కబోయి.. చివరికి ఏం జరిగిందంటే?

GOLD: నిన్న, మొన్న తగ్గినదానికంటే ఇవాళ ఒక్కరోజులోనే..

Bowenpally: పొట్టు.. పొట్టు కొట్టుకున్న బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు

టెట్ అర్హత లేని టీచర్లను నియమించొద్దు సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు

జబర్దస్త్ నరేష్ జీవితంలో ఎన్నో మలుపులు.. వెనుక అసలు కథ..!

నాకు ఏం సంబంధం లేదు కన్నీళ్లు పెట్టుకున్న శ్యామ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్

Photos

+5

దువాతో రణ్‌వీర్‌ సింగ్‌, దీపికా పదుకొణె.. వైరల్‌గా ఫ్యామిలీ (ఫొటోలు)

+5

అందాల ఆషిక.. చీరలో ఆకట్టుకుందిలా..(ఫొటోలు)

+5

అబు జాని 40 సంవత్సరాల ఈవెంట్‌...మెరిసిన ప్రముఖులు (ఫొటోలు)

+5

‘ఎపిక్ ’మూవీ.. హీరోయిన్ వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మెరిసిన.. మాళవిక మోహనన్ (ఫొటోలు)

+5

నల్ల చీరలో మైమరిపించే అందంతో ప్రియా ప్రకాష్ వారియర్..(ఫొటోలు)

+5

చిన్న వయసులోనే సంచలనాలు.. కెప్టెన్‌గా ఎదిగిన గిల్ అరుదైన (ఫొటోలు)

+5

కార్తి 'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్..(ఫొటోలు)

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)