ఏంటి గిల్.. పెళ్లి ఎప్పుడు చేసుకుంటావు?

Published on Mon, 04/21/2025 - 20:54

ఐపీఎల్‌-2025లో ఈడెన్ గార్డెన్స్ వేదిక‌గా కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్‌, గుజ‌రాత్ టైటాన్స్ జ‌ట్లు తల‌ప‌డ‌తున్నాయి. అయితే ఈ మ్యాచ్ టాస్ సంద‌ర్బంగా ఓ ఆస‌క్తిక‌ర స‌న్నివేశం చోటు చేసుకుంది. టాస్ స‌మ‌యంలో న్యూజిలాండ్ మాజీ క్రికెట‌ర్‌, ప్రముఖ క్రికెట్ వ్యాఖ్యాత డానీ మోరిసన్ న‌వ్వులు పూయించాడు.

ఏ సాధార‌ణంగా వ్యాఖ్యాత అయినా టాస్ సంద‌ర్భంగా కెప్టెన్‌లను జ‌ట్టు మార్పులు, మ్యాచ్ ప్లాన్స్ గురుంచి అడుగుతారు. కానీ మోరిస‌న్ మాత్రం గుజ‌రాత్ కెప్టెన్ శుబ్‌మ‌న్ గిల్‌ను త‌న‌ వివాహ ప్రణాళికల గురించి అడిగాడు. ఈ కివీస్ మాజీ క్రికెట‌ర్ గిల్‌ను త్వరలో పెళ్లి చేసుకుంటున్నారా? అని ప్ర‌శ్నించాడు. 

ఆ ప్రశ్నతో ఆశ్చర్యపోయిన గిల్‌.. అటువంటి ప్లాన్స్ ఏమీ లేవంటూ న‌వ్వుతూ స‌మధాన‌మిచ్చాడు. వీరిద్ద‌రి సంభాష‌ణ‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల‌వుతోంది. ఇక ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన కేకేఆర్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది.

కోల్‌క‌తా రెండు మార్పుల‌తో బ‌రిలోకి దిగింది. వ‌రుస మ్యాచ్‌ల్లో విఫ‌ల‌మ‌వ‌తున్న స్టార్ ఓపెన‌ర్ క్వింట‌న్ డికాక్‌ను కేకేఆర్‌ మెనెజ్‌మెంట్ ప‌క్క‌న పెట్టింది. అత‌డి స్ధానంలో అఫ్గాన్ స్టార్ ప్లేయ‌ర్ గుర్బాజ్ తుది జ‌ట్టులోకి వ‌చ్చాడు. 

తుది జ‌ట్లు
గుజరాత్ టైటాన్స్ (ప్లేయింగ్ XI): సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్ (కెప్టెన్‌), జోస్ బట్లర్ (వికెట్ కీప‌ర్‌), షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్, రాహుల్ తెవాటియా, వాషింగ్టన్ సుందర్, షారుక్ ఖాన్, రషీద్ ఖాన్, రవిశ్రీనివాసన్ సాయి కిషోర్, ప్రసిద్ధ్ కృష్ణ, మహ్మద్ సిరాజ్

కోల్‌కతా నైట్ రైడర్స్ (ప్లేయింగ్ XI): రహ్మానుల్లా గుర్బాజ్(వికెట్ కీప‌ర్‌), సునీల్ నరైన్, అజింక్యా రహానే(కెప్టెన్‌), వెంకటేష్ అయ్యర్, రింకూ సింగ్, మొయిన్ అలీ, ఆండ్రీ రస్సెల్, రమణదీప్ సింగ్, హర్షిత్ రాణా, వైభవ్ అరోరా, వరుణ్ చ‌క్ర‌వ‌ర్తి

Videos

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)