శుభమ్ సూపర్ ఇన్నింగ్స్‌.. నైట్‌రైడర్స్‌పై సూపర్‌కింగ్స్‌ విజయం

Published on Wed, 06/25/2025 - 10:49

మేజ‌ర్ లీగ్ క్రికెట్-2025 టోర్నీలో టెక్సాస్ సూప‌ర్ కింగ్స్ తిరిగి గెలుపు బాట ప‌ట్టింది. బుధవారం డ‌ల్లాస్ వేదిక‌గా లాస్ ఏంజిల్స్ నైట్ రైడర్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో 52 ప‌రుగుల తేడాతో సూప‌ర్ కింగ్స్ ఘ‌న విజ‌యం సాధించింది. ఈ మ్యాచ్‌లో మొద‌ట బ్యాటింగ్ చేసిన టీఎస్‌కే నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 8 వికెట్ల నష్టానికి 196 పరుగుల భారీ స్కోర్‌ సాధిచింది.

టీఎస్‌కే బ్యాటర్లలో శుభమ్ రంజనే(75 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్లతో 70) టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. డోనోవన్ ఫెర్రీరా(43), సమిత్‌ పటేల్‌(38) కీలక ఇన్నింగ్స్‌లు ఆడాడరు. కెప్టెన్‌ డుప్లెసిస్‌(12), స్టార్‌ ఆల్‌రౌండర్‌(0) విఫలమయ్యారు.

నైట్‌రైడర్స్‌ బౌలర్లలో వాన్ షాల్క్వైక్, రస్సెల్‌ తలా మూడు వికెట్లు సాధించారు. అనంతరం భారీ లక్ష్య చేధనలో నైట్‌రైడర్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 144 పరుగులకే పరిమితమైంది. లాస్ ఏంజిల్స్ బ్యాటర్లలో ఉన్ముక్త్‌ చ​ంద్‌(30) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు.

టీఎస్‌కే బౌలర్లలో అకిల్‌ హూస్సేన్‌, నూర్‌ ఆహ్మద్‌ తలా రెండు వికెట్లు పడగొట్టగా.. జియా ఉల్‌ హక్‌, స్టోయినిష్‌, ఫెర్రీరా తలా వికెట్‌ సాధించారు. టీఎస్‌కే ఇప్పటివరకు ఆరు మ్యాచ్‌లు ఆడి నాలుగింట గెలుపొంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో డుప్లెసిస్‌ టీమ్‌ రెండో స్ధానంలో కొనసాగుతోంది.
చదవండి: వారి వల్లే ఓడిపోయాము.. అందుకు ఇంకా సమయం ఉంది: గిల్‌

Videos

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)