Breaking News

శ్రేయస్‌ అయ్యర్‌ విధ్వంసకర సెంచరీ.. బౌలర్లకు చుక్కలు

Published on Sat, 11/23/2024 - 15:59

ఐపీఎల్-2025 మెగా వేలానికి ఒక్క రోజు ముందు టీమిండియా స్టార్ ప్లేయర్ శ్రేయ‌స్ అయ్య‌ర్ విధ్వంస‌క‌ర సెంచ‌రీతో చెల‌రేగాడు. స‌య్య‌ద్ ముస్త‌క్ అలీ ట్రోఫీ-2024లో భాగంగా గోవాతో జ‌రిగిన మ్యాచ్‌లో అయ్య‌ర్ అద్భుత శ‌త‌కంతో సత్తాచాటాడు. 

హైద‌రాబాద్ వేదిక‌గా జ‌రిగిన ఈ మ్యాచ్‌లో ముంబై సార‌థిగా బ‌రిలోకి దిగిన అయ్య‌ర్‌.. ప్ర‌త్య‌ర్ధి బౌల‌ర్ల‌ను ఊచ‌కోత కోశాడు. కేవ‌లం 47 బంతుల్లోనే త‌న సెంచ‌రీ మార్క్‌ను అందుకున్నాడు.  ఓవరాల్‌గా 57 బంతులు ఎదుర్కొన్న అయ్య‌ర్ 11 ఫోర్లు, 10 సిక్స‌ర్ల‌తో 130 ప‌రుగులుచేశాడు. 

శ్రేయస్‌తోపాటు పృథ్వీషా(33), ములానీ(41) రాణించారు. దీంతో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 4 వికెట్ల న‌ష్టానికి 250 ప‌రుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన గోవా జట్టు కూడా ఆఖరి వరకు పోరాడింది. లక్ష్య చేధనలో గోవా 8 వికెట్లు కోల్పోయి 224 పరుగులు చేసింది. ఫలితంగా 26 పరుగుల తేడాతో గోవా ఓటమి చవిచూడాల్సి వచ్చింది.

గోవా బ్యాటర్లలో సుయాష్ ప్రభుదేశాయ్‌(52) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ముంబై బౌలర్లలో రాయ్స్టన్‌ ద్యాస్‌, సూర్యన్ష్ షెడ్గే తలా రెండు వికెట్లు పడగొట్టగా.. ములానీ, శార్ధూల్‌ ఠాకూర్‌, మొహిత్‌ తలా వికెట్‌ సాధించారు.
వేలంలో కాసుల వర్షం​ కురవనుందా?
కాగా అయ్యర్‌ ప్రస్తుతం అద్బుతమైన ఫామ్‌లో ఉన్నాడు. దేశవాళీ క్రికెట్‌లో పరుగుల వరద పారిస్తున్నాడు. దీంతో నవంబర్‌ 24, 25 తేదీల్లో జెడ్డా వేదికగా జరగనున్న వేలంలో అయ్యర్‌పై ​కాసుల వర్షం కురిసే అవకాశముంది. కాగా మెగా వేలానికి ముందు కోల్‌కతా నైట్‌రైడర్స్‌ అయ్యర్‌ను వేలంలోకి విడిచిపెట్టిన సంగతి తెలిసిందే.
చదవండి: IND vs AUS: చరిత్ర సృష్టించిన జైశ్వాల్‌.. ప్రపంచంలోనే తొలి క్రికెటర్‌గా
 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)