Breaking News

నిరాశపరిచిన శ్రేయస్, సూర్యకుమార్‌

Published on Thu, 08/29/2024 - 12:13

బుచ్చిబాబు టోర్నీలో టీమిండియా స్టార్లు శ్రేయస్‌ అయ్యర్‌, సూర్యకుమార్‌ యాదవ్‌ తీవ్రంగా నిరాశపరిచారు. తమిళనాడు క్రికెట్‌ అసోసియేషన్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబైకి ప్రాతనిథ్యం వహించిన ఈ ఇద్దరు తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. శ్రేయస్ 3 బంతుల్లో 2 పరుగులు చేసి సాయి కిశోర్ బౌలింగ్‌లో ఔట్‌ కాగా.. సూర్యకుమార్ యాదవ్ 38 బంతుల్లో 3 ఫోర్లు, సిక్సర్‌ సాయంతో 30 పరుగులు చేసి అజిత్‌ రామ్‌ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. 

ఫలితంగా ముంబై తొలి ఇన్నింగ్స్‌లో 8 వికెట్ల నష్టానికి 141 పరుగులు చేసింది. దివ్యాన్ష్ సక్సెనా(61 నాటౌట్‌) హాఫ్ సెంచరీతో రాణించగా.. మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. అంతకుముందు తమిళనాడు 117.3 ఓవర్లలో 379 పరుగులకు ఆలౌటైంది. ప్రదోష్‌ 65, ఇంద్రజిత్‌ 61, భూపతి 82, అజిత్‌ 53 పరుగులు చేయగా.. ముంబై బౌలర్‌ హిమాన్షు 81 పరుగులిచ్చి ఐదు వికెట్లు పడగొట్టాడు.

కాగా, బుచ్చిబాబు టోర్నీలో సత్తా చాటి బంగ్లాదేశ్‌ సిరీస్‌కు ముందు భారత సెలెక్టర్లను ఆకర్శి​gచాలని శ్రేయస్‌ అయ్యర్‌, సూర్యకుమార్‌ యాదవ్‌ అనుకున్నారు. అయితే వారి ఆశలు అడియాసలయ్యాయి. సాయి కిషోర్‌, అజిత్‌ రామ్‌ వారి ఆశలపై నీళ్లు చల్లారు. వీరిద్దరు మిగతా టీమిండియా ఆటగాళ్లతో కలిసి వచ్చే నెలలో జరిగే దులీప్‌ ట్రోఫీలో మరోసారి తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. 

ఈ టోర్నీలో రాణిస్తే బంగ్లాతో సిరీస్‌కు టీమిండియాలో చోటు దక్కడం దాదాపుగా ఖయమనే చెప్పాలి. అయితే ఈ టోర్నీలో సత్తా చాటడం అంత ఈజీ కాదు. జాతీయ జట్టుకు ఆడిన ఆటగాళ్లంతా ఈ టోర్నీలో పాల్గొంటున్నారు. దీంతో ఇక్కడ పరుగులు సాధించడం కష్టమవుతుంది. వచ్చే నాలుగు నెలల్లో భారత్‌ 10 టెస్ట్ మ్యాచ్‌లు ఆడనుండటంతో శ్రేయస్‌, సూర్యకుమార్‌ లాంటి చాలామంది క్రికెటర్లు రెడ్‌ బాల్‌ క్రికెట్‌పై దృష్టి పెట్టారు. టీమిండియాలో చోటే లక్ష్యంగా వీరంతా పావులు కదుపతునున్నారు. 

Videos

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)