Breaking News

CPL విజేత బార్బడోస్‌ రాయల్స్‌.. కీలకపాత్ర పోషించిన టీమిండియా ప్లేయర్‌

Published on Thu, 09/18/2025 - 15:57

2025 మహిళల కరీబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ టైటిల్‌ను బార్బడోస్‌ రాయల్స్‌ ఎగరేసుకుపోయింది. నిన్న (సెప్టెంబర్‌ 17) జరిగిన ఫైనల్లో ఆ జట్టు గయానా అమెజాన్‌ వారియర్స్‌ను 3 వికెట్ల తేడాతో ఓడించి, వరుసగా మూడో టైటిల్‌ను కైవసం చేసుకుంది. 

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన గయానా నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 136 పరుగులు మాత్రమే చేసింది. యామీ హంటర్‌ (29), కెప్టెన్‌ షెమెయిన్‌ క్యాంప్‌బెల్‌ (28 నాటౌట్‌), వాన్‌ నికెర్క్‌ (27 నాటౌట్‌) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. బార్బడోస్‌ బౌలర్లలో షమీలియా కాన్నెల్‌, అఫీ ఫ్లెచర్‌, ఆలియా అల్లెన్‌ తలో వికెట్‌ తీశారు.

అనంతరం బరిలోకి దిగిన బార్బడోస్‌.. 19.4 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. కోట్నీ వెబ్ (31), కైసియా నైట్‌ (31), చమారీ ఆటపట్టు (25) గెలుపుకు తమవంతు సహకారాన్ని అందించగా.. ఆఖర్లో టీమిండియా ఆల్‌రౌండర్‌ శ్రేయాంక పాటిల్‌ (6 బంతుల్లో 10 నాటౌట్‌; 2 ఫోర్లు), ఆలియా అల్లెన్‌ (9 బంతుల్లో 17 నాటౌట్‌; ఫోర్‌, సిక్స్‌) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడి బార్బడోస్‌ను విజయతీరాలకు చేర్చారు.

స్వల్ప స్కోర్‌ను కాపాడుకునేందుకు గయానా బౌలర్లు చాలా కష్టపడినప్పటికీ.. ఆఖర్లో ఆలియా, శ్రేయాంక వారి నుంచి మ్యాచ్‌ను లాగేసుకున్నారు. 18 బంతుల్లో 27 పరుగులు చేయాల్సిన తరుణంలో వరుసగా రెండు వికెట్లు కోల్పోగా.. శ్రేయాంక వరుసగా రెండు బౌండరీలు బాది బార్బడోస్‌ గెలుపును ఖరారు చేసింది.

ఆతర్వాతి ఓవర్‌లో ఆలియా వరుసగా సిక్సర్‌, బౌండరీ బాది బార్బడోస్‌ గెలుపును లాంఛనం చేసింది. ఈ టోర్నీలో తొలిసారి బ్యాటింగ్‌కు దిగిన శ్రేయాంక, బంతితోనూ (2-0-15-0) పర్వాలేదనిపించింది.  21 ఏళ్ల శ్రేయాంక గత కొంతకాలంగా  గాయాలతో సతమతమవుతూ భారత వరల్డ్‌కప్‌ జట్టులో చోటు దక్కించుకోలేకపోయింది. 

Videos

విద్యా శాఖ కమిషనర్ Vs ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి

ఫస్ట్ డేనే ఇంట్లో రణరంగం.. నాయకుడి కోసం పెద్ద గొడవ! రెచ్చిపోయిన రోహిత్..

రామానందనాకు బెయిల్ వస్తుందా..?

రవితేజ రేంజికి తగ్గట్టే రెమ్యునరేషన్ పారితోషికంలో మాత్రం తగ్గేదేలే!

Viral: కదులుతున్న రైలు ఎక్కబోయి.. చివరికి ఏం జరిగిందంటే?

GOLD: నిన్న, మొన్న తగ్గినదానికంటే ఇవాళ ఒక్కరోజులోనే..

Bowenpally: పొట్టు.. పొట్టు కొట్టుకున్న బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు

టెట్ అర్హత లేని టీచర్లను నియమించొద్దు సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు

జబర్దస్త్ నరేష్ జీవితంలో ఎన్నో మలుపులు.. వెనుక అసలు కథ..!

నాకు ఏం సంబంధం లేదు కన్నీళ్లు పెట్టుకున్న శ్యామ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్

Photos

+5

అబు జాని 40 సంవత్సరాల ఈవెంట్‌...మెరిసిన ప్రముఖులు (ఫొటోలు)

+5

‘ఎపిక్ ’మూవీ.. హీరోయిన్ వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మెరిసిన.. మాళవిక మోహనన్ (ఫొటోలు)

+5

నల్ల చీరలో మైమరిపించే అందంతో ప్రియా ప్రకాష్ వారియర్..(ఫొటోలు)

+5

చిన్న వయసులోనే సంచలనాలు.. కెప్టెన్‌గా ఎదిగిన గిల్ అరుదైన (ఫొటోలు)

+5

కార్తి 'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్..(ఫొటోలు)

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)