Breaking News

ముకేశ్‌కు స్వర్ణం, కాంస్యం

Published on Thu, 02/12/2026 - 03:49

న్యూఢిల్లీ: ఆసియా షూటింగ్‌ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆంధ్రప్రదేశ్‌ షూటర్‌ ముకేశ్‌ నేలవల్లి రెండు పతకాలతో మెరిశాడు. బుధవారం జరిగిన జూనియర్‌ పురుషుల 25 మీటర్ల ర్యాపిడ్‌ ఫైర్‌ పిస్టల్‌ వ్యక్తిగత విభాగంలో ముకేశ్‌ కాంస్య పతకం సాధించాడు. ఏడుగురు షూటర్ల మధ్య ఎలిమినేషన్‌ పద్ధతిలో జరిగిన ఫైనల్లో ముకేశ్‌ 19 పాయింట్లు సాధించి మూడో స్థానంలో నిలిచాడు. 

భారత్‌కే చెందిన సూరజ్‌ శర్మ 23 పాయింట్లతో రజతం నెగ్గగా... ఇండోనేసియా షూటర్‌ ఫవాజ్‌ 29 పాయింట్లతో స్వర్ణ పతకాన్ని గెల్చుకున్నాడు. ఇదే ఈవెంట్‌ టీమ్‌ విభాగంలో ముకేశ్, సూరజ్, సాహిల్‌లతో కూడిన భారత జట్టు పసిడి పతకాన్ని సొంతం చేసుకుంది. ముకేశ్‌ బృందం 1729 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. సీనియర్‌ పురుషుల 25 మీటర్ల ర్యాపిడ్‌ ఫైర్‌ పిస్టల్‌ ఈవెంట్‌లో భారత షూటర్‌ అనీశ్‌ భన్వాలా కాంస్య పతకం సాధించాడు. 

అనీశ్‌ 23 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచాడు. టీమ్‌ విభాగంలో అనీశ్, ఆదర్శ్‌ సింగ్, నీరజ్‌ కుమార్‌లతో కూడిన భారత బృందం 1708 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచి రజతం దక్కించుకుంది. ఇప్పటి వరకు ఈ టోరీ్నలో భారత షూటర్లు 35 స్వర్ణాలు, 15 రజతాలు, 14 కాంస్యాలతో కలిపి 64 పతకాలు గెలిచారు.   

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)