Breaking News

'మాకు ఓ అశ్విన్ దొరికేశాడు.. అతడొక సూపర్‌ స్టార్‌'

Published on Fri, 03/01/2024 - 17:54

ధర్మశాల వేదికగా భారత్‌తో ఐదో టెస్టులో తలపడేందుకు ఇంగ్లండ్‌ సిద్దమవుతోంది. విజయంతో ఇండియా టూర్‌ను ముగించాలని ఇంగ్లండ్‌ జట్టు భావిస్తోంది. ఇప్పటికే ఇంగ్లండ్‌ 3-1తో సిరీస్‌ కోల్పోయిన సంగతి తెలిసిందే. అయితే నాలుగో టెస్టులో ఇంగ్లండ్‌ ఓటమి పాలైనప్పటికి ఆ జట్టు యువ స్పిన్నర్‌ షోయబ్ బషీర్‌ మాత్రం అందరని అకట్టుకున్నాడు.

రాంఛీ టెస్టులో బషీర్‌ 8 వికెట్లు పడగొట్టి సత్తాచాటాడు. ఈ క్రమంలో బషీర్‌పై ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌ మైకేల్ వాన్ ప్రశంసల వర్షం కురిపించాడు. భారత స్పిన్‌ దిగ్గజం రవిచంద్రన్‌ అశ్విన్‌తో​ బషీర్‌ను వాన్‌ పోల్చాడు.

"ఇంగ్లండ్‌ జట్టుకు మరో వరల్డ్‌ క్లాస్‌ సూపర్‌స్టార్ దొరికాడు. అతడే యువ సంచలనం షోయబ్ బషీర్‌ . అతడి కెరీర్‌లో తన రెండో టెస్టులోనే అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఏకంగా 8 వికెట్టు పడగొట్టి ప్రత్యర్ధి జట్టును భయపెట్టాడు. వరల్డ్‌ క్రికెట్‌లో మరో అశ్విన్‌ పుట్టుకొచ్చాడు. మాకు  ఓ అశ్విన్‌ దొరికినందుకు సెలబ్రేషన్స్‌ జరపుకుంటున్నామునజ ఇక ధర్మశాల టెస్టులో ఇంగ్లండ్ విజయం సాధిస్తుందని భావిస్తున్నా.

మా జట్టు అత్యుత్తమ ప్లేయింగ్‌ ఎలెవన్‌తో బరిలోకి దిగాలి. ధర్మశాల వాతావారణం ఇంగ్లండ్‌ జట్టుకు అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ఇంగ్లండ్‌కు గెలిచే ఛాన్స్‌లు ఎక్కువగా ఉన్నాయి. భారత్‌ మాత్రం తమ జట్టులో కొన్ని మార్పులు చేసే ఛాన్స్‌ ఉందని ఓ యూట్యాబ్‌ ఛానల్‌లో వాన్‌ పేర్కొన్నాడు.
చదవండి: #BCCI: 'అతడొక లీడింగ్‌ వికెట్‌ టేకర్‌.. అయినా కాంట్రాక్ట్‌ నుంచి'
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)