హెడ్‌ కోచ్‌గా శివనారాయణ్‌ చంద్రపాల్‌.. ఆ జట్టుకు ఇక తిరుగు లేదు

Published on Mon, 10/13/2025 - 13:59

‘ది నేపాల్ ప్రీమియ‌ర్ లీగ్’ (NPL) సెకెండ్ సీజ‌న్‌కు రంగం సిద్ద‌మ‌వుతోంది. ఈ మెగా ఈవెంట్ నవంబర్ 17 నుండి డిసెంబర్ 13 వరకు జరుగుతుంది. ఈ క్ర‌మంలో డిఫెండింగ్ ఛాంపియన్స్ జనక్‌పూర్ బోల్ట్స్ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. వెస్టిండీస్ క్రికెట్ లెజెండ్ శివనారాయణ్ చంద్రపాల్‌ను త‌మ జ‌ట్టు ప్ర‌ధాన కోచ్‌గా జనక్‌పూర్ నియ‌మించింది.

ఈ విష‌యాన్ని జనక్‌పూర్ బోల్ట్స్ ఫ్రాంచైజీ సోష‌ల్ మీడియా వేదిక‌గా వెల్ల‌డించింది. మొద‌టి సీజ‌న్‌లో జనక్‌పూర్ హెడ్ కోచ్‌గా ప‌నిచేసిన పుబుడు దస్నాయకే స్ధానాన్ని చాందర్‌పాల్‌ భ‌ర్తీ చేయ‌నున్నాడు. అయితే తొలి సీజ‌న్‌లోనే ఛాంపియ‌న్‌గా నిలిపిన‌ప్ప‌టికి.. దస్నాయకేను ఎందుకు త‌ప్పించారో స‌దరు ఫ్రాంచైజీ వెల్ల‌డించ‌లేదు. చంద్రపాల్‌ కోచింగ్‌లో తమ జట్టు అద్భుతాలు సృష్టిస్తుందని జనక్‌పూర్ బోల్ట్స్ థీమా వ్యక్తం చేసింది.

విలక్షణమైన బ్యాటింగ్‌ శైలితో ప్రసిద్ధి గాంచిన చంద్రపాల్.. వరల్డ్ క్రికెట్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. శివనారాయణ్ అంతర్జాతీయ క్రికెట్‌లో 20,000 కంటే ఎక్కువ పరుగులు చేశాడు. టెస్ట్‌లలో 11,867, వన్డేలలో 8,778 పరుగులు చేశాడు. రెండు దశాబ్దాలకు పైగా విండీస్ క్రికెట్‌కు తన సేవలను అందించాడు.

అదేవిధంగా కోచ్‌గా కూడా చంద్రపాల్‌ను అనుభవం ఉంది. కరేబియన్ ప్రీమియర్ లీగ్ (CPL)లో జమైకా తలైవాస్‌తో కలిసి పనిచేశాడు. ఆ తర్వాత యూఎస్‌ఎ మహిళల జాతీయ జట్టుకు ప్రధాన కోచ్‌గా తన సేవలను అందించాడు. ఇప్పుడు మరోసారి తన అనుభవాన్ని పంచుకునేందుకు చంద్రపాల్ సిద్దమయ్యాడు.
చదవండి: ఇది అవుట్‌ అని మీకూ తెలుసు.. కానీ: నవ్వుతూనే ఇచ్చిపడేసిన బుమ్రా

Videos

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)