Breaking News

దూబే చీటింగ్‌ చేశాడా..? జేబులు చెక్‌ చేసిన అంపైర్‌! ఫోటోలు వైరల్‌

Published on Sat, 04/20/2024 - 07:10

ఐపీఎల్‌-2024లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ మూడో ఓటమి చవిచూసింది. ఏక్నా స్టేడియం వేదికగా లక్నో సూపర్‌ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో సీఎస్‌కే ఓటమి పాలైంది. చెన్నై బ్యాటింగ్‌లో పర్వాలేదన్పించనప్పటికి.. బౌలింగ్‌లో మాత్రం పూర్తిగా తేలిపోయింది. 177 పరుగుల లక్ష్యాన్ని సీఎస్‌కే బౌలర్లు కాపాడుకోలేకపోయారు.  

177 పరుగుల లక్ష్యాన్ని లక్నో 19 ఓవర్లలో కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి చేధించింది. అయితే ఈ మ్యాచ్‌లో ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. సీఎస్‌కే బ్యాటింగ్‌ సందర్భంగా ఆ జట్టు మిడిల్ ఆర్డర్ బ్యాటర్ శివమ్ దూబే జేబులను ఆన్‌ ఫీల్డ్‌ అంపైర్‌ చెక్‌ చేశాడు. దూబే క్రీజులోకి వచ్చిన తర్వాత ఇన్నింగ్స్‌ మధ్యలో అంపైర్‌ అనిల్‌ చౌదరీ.. అతడి దగ్గరకు వెళ్లి అనుమానాస్పదంగా  జేబులను తనిఖీ చేశాడు.

ఇందుకు సంబంధిచిన ఫోటోలు సోషల్‌ మీడియా కాగా అంపైర్‌లు ఇలా ఆటగాళ్ల జేబులను చెక్‌ చేయడం చాలా అరుదుగా జరుగుతుంటుంది. అయితే అంపైర్‌ దూబే పాకెట్స్‌ను చెక్‌ చేయడానికి గల కారణమైతే ఇప్పటివరకు తెలియలేదు. కానీ అంపైర్‌లు అప్పుడప్పుడు ఆటగాళ్లు తమతో పాటు బంతి స్ధితిని మార్చే వస్తువులు ఏమైనా తీసుకు వచ్చారేమోనని అనుమానంతో తనిఖీ చేస్తూ ఉంటారు.

అదే విధంగా ఆటగాళ్లు అంపైర్‌లు అనుమతి లేకుండా ఎటువంటి క్రీమ్స్‌ గానీ అయింట్‌మెంట్‌లు గాని వాడకూడదు. కాగా ఈ మ్యాచ్‌లో దూబే కేవలం 3 పరుగులు మాత్రమే చేశాడు.

Videos

ఏపీలో రాష్ట్రపతి పాలన?

కోల్ కతాలో దుర్గా పూజ వేడుకల్లో తీవ్ర విషాదం.. 19 మంది దుర్మరణం

YS అవినాష్ రెడ్డిపై టీడీపీ గూండాల హత్యాయత్నం

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)