Breaking News

ధోనిపై 'సిక్సర్ల' దూబే ఆసక్తికర వ్యాఖ్యలు

Published on Fri, 06/23/2023 - 13:46

చెన్నై సూపర్‌కింగ్స్‌ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోనీ సలహాలు, సూచనల వల్లే తాను ఈ స్థాయిలో ఉన్నట్లు యువ ఆల్‌రౌండర్‌ శివమ్‌ దూబే పేర్కొన్నాడు. ఇటీవల జరిగిన 16వ సీజన్‌ ఐపీఎల్‌లో చెన్నై విజేతగా నిలువడంలో దూబే కీలకంగా వ్యవహరించాడు. భారీ సిక్సర్లకు పెట్టింది పేరైన శివమ్‌ దూబే ఈ సీజన్‌లో 16 మ్యాచ్‌లాడి 158.33 స్ట్రైక్‌రేట్‌తో 416 పరుగులు సాధించాడు. కీలకమైన మిడిలార్డర్‌లో భారీ షాట్లతో విరుచుకుపడుతూ జట్టుకు విజయాలందించాడు. 'పరిమ్యాచ్‌ స్పోర్ట్స్‌'(Parimatch Sports)కు బ్రాండ్‌అంబాసిడర్‌గా ఎంపికైన దూబే గురువారం హైదరాబాద్‌కు విచ్చేశాడు.

ఈ సందర్భంగా దూబే మాట్లాడుతూ ''గత ఐపీఎల్‌ సీజన్‌ అద్భుతంగా సాగింది. చెన్నై జట్టుతో ఈ సీజన్‌ మరిచిపోని అనుభూతిని మిగిల్చింది. మేనేజ్‌మెంట్‌, సహాయక బృందం మద్దతుతో నేను ఈ స్థాయిలో రాణించగలిగాను. కెప్టెన్‌ ధోనీ నుంచి ఎన్నో విషయాలను నేర్చుకున్నాను. ఒత్తిడికి లోనవ్వకుండా ఆటపైన ఎలా దృష్టి సారించాలనేది తెలుసుకున్నా. ఈ స్థాయిలో ఉన్నానంటే అందుకు ధోనినే కారణం.'' అంటూ చెప్పుకొచ్చాడు.

ఇక తన టీం సభ్యుల గురించి దూబే మాట్లాడుతూ.. అంబటి రాయుడు అపుడప్పుడు మస్తీ చేసినప్పటికి చూడటానికి సీరియస్‌గా కనిపంచేవాడు.. దీపక్‌ చాహర్‌ ప్రాంక్‌ స్టార్‌గా అభివర్ణించారు. వ్యక్తిగత ఆట కన్నా బృందంగా రాణించడమే ముఖ్యంగా భావిస్తానని పేర్కొన్నాడు. ఇండియన్‌ టీంకు ఆడటం తన జీవితంలో మరిచిపోలేని అనుభూతి అని..ఈ ఐపీఎల్‌ కూడా ఎన్నో మధురజ్ఞ్ఞాపకాలను అందించిందన్నాడు.

చదవండి: బ్రెజిల్‌ ఫుట్‌బాల్‌ స్టార్‌ నేమార్‌కు ఊహించని షాక్‌! మిలియన్‌ డాలర్‌ ఫైన్‌

'మిస్టర్‌ రజనీ ఎందుకు ఎక్స్‌ట్రాలు చేస్తున్నావ్‌!'

Videos

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు