Breaking News

టీమిండియా క్రికెట‌ర్ మంచి మ‌న‌సు.. రూ.7 ల‌క్ష‌ల‌ ఆర్ధిక సాయం

Published on Tue, 04/22/2025 - 18:54

టీమిండియా క్రికెట‌ర్‌, చెన్నై సూప‌ర్ కింగ్స్ స్టార్ ఆల్‌రౌండ‌ర్ శివ‌మ్ దూబే త‌న మంచి మ‌న‌సును చాటుకున్నాడు. తమిళనాడుకు చెందిన‌  పది మంది యువ, ప్రతిభావంతులైన క్రీడాకారులకు రూ.7 ల‌క్ష‌ల‌ ఆర్ధిక సాయాన్ని దూబే చేశాడు. మంగళవారం జరిగిన తమిళనాడు స్పోర్ట్స్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ (TNSJA) అవార్డ్స్ అండ్ స్కాలర్‌షిప్‌ల ప్ర‌ధానోత్స‌వ కార్య‌క్ర‌మంలో యంగ్ అథ్లెట్స్‌కు దూబే చెక్‌ల‌ను అంద‌జేశాడు.

ఈ కార్యక్రమానికి దూబే ముఖ్య అతిథిగా  హాజ‌ర‌య్యాడు. అదేవిధంగా యువ అథ్లెట్లకు వారి విజయాలకు గుర్తింపుగా తమిళనాడు స్పోర్ట్స్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ కూడా రూ. 30,000 స్కాలర్‌షిప్‌లను అంద‌జేసింది. ఈ సంద‌ర్భంగా దూబే మాట్లాడుతూ.. "ఈ కార్య‌క్ర‌మం యువ అథ్లెట్లందరికీ చాలా ప్రోత్సాహకరంగా ఉంద‌ని నేను భావిస్తున్నాను.

ఈ చిన్న విజ‌యాల‌ను  గుర్తించి వారిలో కొత్త ఉత్స‌హాన్ని తమిళనాడు స్పోర్ట్స్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ నింపుతోంది. వారు  మరింత కష్టపడి ప‌నిచేసి దేశానికి గర్వకారణంగా నిలుస్తారు ఆశిస్తున్నాను. ఈ అద్భుత‌మైన కార్య‌క్రామానికి న‌న్ను ఆహ్వానించిందుకు కృతజ్ఞత‌లు తెలియ‌జేస్తున్నాను. ముంబైలో కూడా ఇటువంటి కార్యాక్ర‌మాలు నేను చూశాను. ఇప్పుడు ఇతర రాష్ట్రాల్లో కూడా యువ క్రీడాకారుల‌కు మ‌ద్ద‌తునిచ్చే పోగ్రామ్స్ నిర్వ‌హిస్తుండ‌డం చాలా సంతోషంగా ఉంద‌ని" అన్నాడు.

న‌గ‌దు సాయం అందుకున్న తమిళనాడు అథ్లెట్లు వీరే..
పిబి అభినంద్ (టేబుల్ టెన్నిస్)
కెఎస్ వెనిస శ్రీ (ఆర్చ‌రీ)
ముత్తుమీనా వెల్లసామి (పారా అథ్లెటిక్స్)
షమీనా రియాజ్ (స్క్వాష్)
ఎస్ నంధన (క్రికెట్)
కమలి పి (సర్ఫింగ్)
ఆర్ అభినయ (అథ్లెటిక్స్)
ఆర్‌సి జితిన్ అర్జునన్ (అథ్లెటిక్స్)
తక్షంత్ (చెస్)
జయంత్ ఆర్కే (క్రికెట్)

Videos

ఏపీలో రాష్ట్రపతి పాలన?

కోల్ కతాలో దుర్గా పూజ వేడుకల్లో తీవ్ర విషాదం.. 19 మంది దుర్మరణం

YS అవినాష్ రెడ్డిపై టీడీపీ గూండాల హత్యాయత్నం

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)