స‌న్‌రైజ‌ర్స్ ఆల్‌రౌండ‌ర్ విధ్వంసం.. కేవ‌లం 17 బంతుల్లోనే

Published on Thu, 06/11/2026 - 09:24

మధ్యప్రదేశ్ ప్రీమియర్ లీగ్-2026లో సన్‌రైజర్స్ హైదరాబాద్ యువ ఆల్‌రౌండర్ శివాంగ్ కుమార్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఈ టోర్నీలో బుందేల్‌ఖండ్ బుల్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న శివాంగ్‌.. బుధవారం మాల్వా స్టాలియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టాడు.

ఈ మ్యాచ్‌లో మొద‌ట బ్యాటింగ్ చేసిన మాల్వా జ‌ట్టు నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 5 వికెట్ల న‌ష్టానికి  215 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఓపెనర్ అన్ష్ యాదవ్  (44 బంతుల్లోనే 5 ఫోర్లు, 6 సిక్సర్లతో  81 పరుగులు) సంచ‌ల‌న ఇన్నింగ్స్ ఆడాడు. అత‌డితో పాటు సక్షమ్ పురోహిత్(40), అఖిల్(33) రాణించారు.  బుందేల్‌ఖండ్ బౌలర్లలో అనంత్ దూబే, శివాంగ్ కుమార్ చెరో 2 వికెట్లు పడగొట్టారు.

శివాలెత్తిన శివాంగ్‌
అనంతరం 216 పరుగుల భారీ లక్ష్య చేధనలో శివాంగ్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఫస్ట్‌ డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన శివాంగ్‌.. ప్రత్యర్ధి బౌలర్లకు చుక్కలు చూపించాడు. కేవలం 17 బంతుల్లోనే 7 ఫోర్లు, 5 సిక్స్‌లతో 65 పరుగులు చేశాడు. అతడితో పాటు విక్రాంత్‌(43), అమన్‌ జైన్‌(17) రాణించారు.

ఫలితంగా బుందేల్‌ఖండ్ లక్ష్యాన్ని 7 వికెట్లు కోల్పోయి 19.1 ఓవర్లలో చేధించింది. మాల్వా బౌలర్లలో పార్థ్‌ సహాని, ప్రశాంత్‌, పవన్‌ యాదవ్‌ తలా రెండు వికెట్లు సాధించారు. కాగా ఇటీవల ముగిసిన ఐపీఎల్‌ సీజన్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌ తరపున శివాంగ్‌ 9 వికెట్లు పడగొట్టి ఆకట్టుకున్నాడు.

Videos

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

Photos

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)