హెట్‌మైర్‌ మెరుపులు.. నైట్‌రైడర్స్‌ చిత్తు

Published on Sat, 12/06/2025 - 10:27

ఇంటర్నేషనల్‌ టీ20 లీగ్‌లో భాగంగా నిన్న (డిసెంబర్‌ 5) జరిగిన మ్యాచ్‌లో డెసర్ట్‌ వైపర్స్‌, అబుదాబీ నైట్‌రైడర్స్‌ తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో వైపర్స్‌ 2 వికెట్ల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన నైట్‌రైడర్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. అలెక్స్‌ హేల్స్‌ (53) అర్ద సెంచరీతో రాణించగా.. ఆఖర్లో రసెల్‌ (36 నాటౌట్‌) మెరుపు ఇన్నింగ్స్‌ ఆడాడు.

మిగతా ఆటగాళ్లలో ఫిల్‌ సాల్ట్‌ 18, అలీషాన్‌ షరాఫు 25, లివింగ్‌స్టోన్‌ 4, రూథర్‌ఫోర్డ్‌ 3, చంద్‌ 18, నరైన్‌ 1 (నాటౌట్‌) పరుగు చేశారు. వైపర్స్‌ బౌలర్లలో ఖైస్‌ అహ్మద్‌, నూర్‌ అహ్మద్‌ తలో 2, నసీం షా, డాన్‌ లారెన్స్‌ చెరో వికెట్‌ తీశారు.

అనంతరం​ ఓ మెస్తరు లక్ష్య ఛేదనకు దిగిన వైపర్స్‌ మరో 3 బంతులు మిగిలుండగానే (8 వికెట్లు కోల్పోయి) లక్ష్యాన్ని చేరుకుంది. షిమ్రోన్‌ హెట్‌మైర్‌ (25 బంతుల్లో 48; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌ ఆడి వైపర్స్‌ను గెలిపించాడు. అతనికి డాన్‌ లారెన్స్‌ (35), తన్వీర్‌ (31 నాటౌట్‌) సహకరించారు. నైట్‌రైడర్స్‌ బౌలర్లలో అజయ్‌ కుమార్‌ 3, నరైన్‌ 2, స్టోన్‌, పియూశ్‌ చావ్లా, రసెల్‌ తలో వికెట్‌ తీశారు. 

Videos

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)