Breaking News

శివాలెత్తిన షిమ్రోన్‌ హెట్‌మైర్‌.. వరుసగా రెండో మ్యాచ్‌లో ఊచకోత

Published on Sun, 06/29/2025 - 15:12

మేజర్‌ లీగ్‌ క్రికెట్‌ 2025 ఎడిషన్‌లో సియాటిల్‌ ఓర్కాస్‌ ఆటగాడు షిమ్రోన్‌ హెట్‌మైర్‌ చెలరేగిపోతున్నాడు. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో విధ్వంసకర ఇన్నింగ్స్‌లు ఆడి తన జట్టును గెలిపించాడు. నిన్న ఎంఐ న్యూయార్క్‌పై చివరి బంతికి సిక్సర్‌ బాది ఓర్కాస్‌ను గెలిపించిన హెట్‌మైర్‌.. ఇవాళ (జూన్‌ 29) లాస్‌ ఏంజెలెస్‌ నైట్‌రైడర్స్‌పై కూడా అదే పని (19.5వ ఓవర్‌) చేశాడు.

టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన నైట్‌రైడర్స్‌.. రసెల్‌ (39 బంతుల్లో 65 నాటౌట్‌; 6 ఫోర్లు, 4 సిక్సర్లు), రోవ్‌మన్‌ పావెల్‌ (21 బంతుల్లో 43 నాటౌట్‌; 2 ఫోర్లు, 4 సిక్సర్లు), సైఫ్‌ బదార్‌ (21 బంతుల్లో 41; 2 ఫోర్లు, 4 సిక్సర్లు) విధ్వంసకర ఇన్నింగ్స్‌లు ఆడటంతో నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 202 పరుగులు చేసింది.

భారీ లక్ష్య ఛేదనలో రెండో బంతికే వికెట్‌ (జోష్‌ బ్రౌన్‌ 0) కోల్పోయిన ఓర్కాస్‌.. షయాన్‌ జహంగీర్‌ (31 బంతుల్లో 43; 2 ఫోర్లు, 3 సిక్సర్లు), ఆరోన్‌ జోన్స్‌ (38 బంతుల్లో 73; 10 ఫోర్లు, 2 సిక్సర్లు), హెట్‌మైర్‌ (26 బంతుల్లో 64 నాటౌట్‌; 4 ఫోర్లు, 6 సిక్సర్లు) చెలరేగడంతో మరో బంతి మిగిలుండగానే విజయతీరాలకు చేరింది. హెట్‌మైర్‌ 19వ ఓవర్‌ ఐదో బంతికి సిక్సర్‌ బాది తన జట్టును వరుసగా రెండో మ్యాచ్‌లో గెలిపించాడు.

ఈ మ్యాచ్‌లో 18 బంతుల్లో హాఫ్‌ సెంచరీ పూర్తి చేసిన హెట్‌మైర్‌.. మేజర్‌ లీగ్‌ చరిత్రలో రెండో వేగవంతమైన అర్ద సెంచరీని నమోదు చేశాడు. ఎంఎల్‌సీలో ఫాస్టెస్ట్‌ హాఫ్‌ సెంచరీ రికార్డు ఎంఐ న్యూయార్క్‌ ఆటగాడు నికోలస్‌ పూరన్‌ పేరట ఉంది. పూరన్‌ 2023 ఎడిషన్‌లో కేవలం​ 16 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీ పూర్తి చేశాడు.

ఈ మ్యాచ్‌లో 203 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించిన ఓర్కాస్‌ లీగ్‌ చరిత్రలో ఐదో అత్యధిక లక్ష్య ఛేదనను నమోదు చేసింది. ఈ గెలుపుతో ఓర్కాస్‌ ప్లే ఆఫ్స్‌ ఆశలను సజీవంగా ఉంచుకుంది. శాన్‌ ఫ్రాన్సిస్కో యూనికార్న్స్‌, వాషింగ్టన్‌ ఫ్రీడం ఇదివరకే ప్లే ఆఫ్స్‌ బెర్త్‌లు ఖరారు చేసుకున్నాయి. 

Videos

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

మళ్లీ ఢిల్లీకి రేవంత్.. మంత్రుల్లో కొత్త టెన్షన్!

10 ఏళ్లలో 82% పనులు..!వెలిగొండపై YSR-జగన్ కు ఘనత

Pedakakani Temple: గుడిలోకి వెళ్లకుండా ఆపారు ఇచ్చిపడేసిన అశోక్ బాబు

బాలిక ఎక్కడుంది..? 80 రోజులైనా ఆచూకీ లేదు పోలీసుల తీరుపై హైకోర్టు ఫైర్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు