Breaking News

Sheffield Shield 2024 Final: సెంచరీతో కదంతొక్కిన సామ్‌

Published on Thu, 03/21/2024 - 21:50

ఫెఫీల్డ్‌ షీల్డ్ 2023-24 ఎడిషన్‌ ఫైనల్‌ ఇవాళ (మార్చి 21) ప్రారంభమైంది. టస్మానియాతో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేస్తున్న వెస్ట్రన్‌ ఆస్ట్రేలియా.. తొలి రోజు ఆట ముగిసే సమయానికి 8 వికెట్ల నష్టానికి 325 పరుగులు చేసింది. కెప్టెన్‌ సామ్‌ వైట్‌మన్‌ (104) సెంచరీతో కదంతొక్కగా.. ఆర్కీ షార్ట్‌ (50), హిల్టన్‌ కార్ట్‌వైట్‌ (55), కూపర్‌ కొన్నొల్లీ (73 నాటౌట్‌) అర్దసెంచరీలతో రాణించారు.

మరి కొద్ది సమయంలో తొలి‌ రోజు ఆట ముగుస్తుందనగా.. కూపర్‌ చెలరేగిపోయాడు. టస్మానియా బౌలర్లపై బౌండీరలు, సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. టస్మానియా బౌలర్లలో ఫ్రీమన్‌ 3 వికెట్లు పడగొట్టగా.. లియాన్‌ కర్లిసైల్‌ 2, రిలే మెరిడిత్‌, గేబ్‌ బెల్‌, వెబ్‌స్టర్‌ తలో వికెట్‌ దక్కించుకున్నారు. ఈ మ్యాచ్‌లో టస్మానియా టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకుంది. 130 ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన ఈ టోర్నీలో ఈ సారి కూడా ఫైనలిస్ట్‌ అయిన వెస్ట్రన్‌ ఆస్ట్రేలియా డిఫెండింగ్‌ ఛాంపియన్‌గా ఉంది. ఈ జట్టు గడిచిన రెండు సీజన్లలో ఛాంపియన్‌గా కొనసాగుతూ హ్యాట్రిక్‌పై కన్నేసింది. 

Videos

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

Photos

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)