Breaking News

151 కి.మీ వేగంతో బౌలింగ్‌.. అయినా 104 మీటర్ల భారీ సిక్స్‌! వీడియో వైరల్‌

Published on Sat, 07/29/2023 - 13:51

అమెరికా వేదికగా జరుగుతున్న మేజర్‌ లీగ్‌ క్రికెట్‌ తొలి ఎడిషన్‌లో ముంబై న్యూయార్క్‌ జట్టు ఫైనల్‌కు చేరింది. శనివారం టెక్సస్‌ సూపర్‌ కింగ్స్‌తో జరిగిన ఛాలెంజర్‌ మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో విజయం సాధించిన ముంబై.. ఫైనల్‌ బెర్త్‌ను ఖారారు చేసుకుంది.  159 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై కేవలం 4 వికెట్లు మాత్రమే కోల్పోయి 19 ఓవర్లలో ఛేదించింది.

న్యూయర్క్‌ జట్టు లక్ష్య ఛేదనలో ఆ జట్టు యువ ఆటగాళ్లు  డెవాల్డ్‌ బ్రెవిస్‌(41),జహంగీర్(36),టిమ్‌ డేవిడ్‌(33) కీలక పాత్ర పోషించారు. అం‍తకుముందు బౌల్ట్‌ నాలుగు వికెట్లతో చెలరేగడంతో టెక్సస్‌ సూపర్‌ కింగ్స్‌ 158 పరుగులకు ఆలౌటైంది. ఇక ఆదివారం జరగనున్న టైటిల్‌ పోరులో సీటెల్ ఓర్కాస్,ముంబై న్యూయార్క్‌ జట్లు అమీ తుమీ తెల్చుకోనున్నాయి.

ముంబై ఆటగాడి భారీ సిక్సర్‌..
ఇ​క ఈ మ్యాచ్‌లో ముంబై న్యూయర్క్‌ ఓపెనర్‌  షాయన్ జహంగీర్ భారీ సిక్సర్‌ బాదాడు. అతడు కొట్టిన సిక్స్‌ మ్యాచ్‌ మొత్తానికే హైలెట్‌గా నిలిచింది. ముంబై ఇన్సింగ్స్‌ 5 ఓవర్‌లో 151 కి.మీ వేగంతో పేసర్‌ గెరాల్డ్ కోయెట్జీ వేసిన బంతిని.. జహంగీర్ అంతే వేగంతో 104 మీటర్ల భారీ సిక్స్‌గా మలిచాడు.

ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా షాయన్ జహంగీర్ అంతర్జాతీయ క్రికెట్‌లో అమెరికాకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఇటీవల ముగిసిన వన్డే వరల్డ్‌కప్‌ క్వాలిఫయర్స్‌లో తన తొలి అంతర్జాతీయ సెంచరీని కూడా అందుకున్నాడు.
చదవండి: Rajinikanth On IPL SRH Team: ఎస్‌ఆర్‌హెచ్‌ ఓనర్‌ కావ్యా బాధను చూడలేకపోతున్నా: రజనీకాంత్‌

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)