Breaking News

ఇషాన్‌ కిషన్‌ సెంచరీ.. భారీ స్కోర్‌ దిశగా ఇండియా-సి టీమ్‌

Published on Fri, 09/13/2024 - 04:11

సాక్షి, అనంతపురం: యువ ఆటగాడు ఇషాన్‌ కిషన్‌ (126 బంతుల్లో 111; 14 ఫోర్లు, 3 సిక్సర్లు) సెంచరీతో చెలరేగాడు. ఫలితంగా అనంతపురంలో భారత్‌ ‘బి’ జట్టుతో గురువారం మొదలైన దులీప్‌ ట్రోఫీ రెండో రౌండ్‌ మ్యాచ్‌లో భారత్‌ ‘సి’ జట్టు భారీ స్కోరు దిశగా సాగుతోంది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ ‘సి’ జట్టు తొలి రోజు ఆట ముగిసే సమయానికి 79 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 357 పరుగులు చేసింది. ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌ పునరాగమనంలో ఆడిన తొలి మ్యాచ్‌లోనే ఇషాన్‌ కిషన్‌ శతక్కొట్టగా... మిగతా బ్యాటర్లు కూడా విలువైన పరుగులు చేయడంతో భారత్‌ ‘సి’ జట్టు మెరుగైన స్కోరు చేయగలిగింది. 

కెప్టెన్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ (50 బంతుల్లో 46 బ్యాటింగ్‌; 7 ఫోర్లు, 2 సిక్సర్లు), సాయి సుదర్శన్‌ (75 బంతుల్లో 43; 8 ఫోర్లు), రజత్‌ పాటిదార్‌ (67 బంతుల్లో 40; 8 ఫోర్లు), బాబా ఇంద్రజిత్‌ (136 బంతుల్లో 78; 9 ఫోర్లు) రాణించారు. మ్యాచ్‌ ఆరంభంలో రెండు బంతులు ఎదుర్కోగానే మడమ నొప్పితో మైదానాన్ని వీడిన కెప్టెన్ రుతురాజ్‌ గైక్వాడ్‌... కోలుకొని తిరిగి క్రీజులో అడుగు పెట్టి అజేయంగా నిలిచాడు. అతడితో పాటు మానవ్‌ సుతార్‌ (8 బ్యాటింగ్‌) క్రీజులో ఉన్నాడు. 

గాయం కారణంగా దులీప్‌ ట్రోఫీ తొలి రౌండ్‌ మ్యాచ్‌కు అందుబాటులో లేకుండా పోయిన ఇషాన్‌ కిషన్‌... రెండో రౌండ్‌ మ్యాచ్‌లో చక్కటి ఆటతీరు కనబర్చాడు. ఇంద్రజిత్‌తో కలిసి మూడో వికెట్‌కు 189 పరుగులు జోడించి జట్టును పటిష్ట స్థితికి చేర్చాడు. ఇటీవల బుచ్చిబాబు టోర్నమెంట్‌లో జార్ఖండ్‌ తరఫున సెంచరీతో చెలరేగిన ఇషాన్‌ కిషన్‌... ఇక్కడే అదే జోరు కొనసాగించాడు. భారత్‌ ‘బి’ బౌలర్లలో ముఖేశ్‌ కుమార్‌ 3 వికెట్లు పడగొట్టగా... నవ్‌దీప్‌ సైనీ, రాహుల్‌ చహర్‌ చెరో వికెట్‌ తీశారు.  

స్కోరు వివరాలు 
భారత్‌ ‘సి’ తొలి ఇన్నింగ్స్‌: రుతురాజ్‌ గైక్వాడ్‌ (బ్యాటింగ్‌) 46; సాయి సుదర్శన్‌ (సి) నవ్‌దీప్‌ సైనీ (బి) ముకేశ్‌ కుమార్‌ 43; రజత్‌ పాటిదార్‌ (బి) నవ్‌దీప్‌ సైనీ 40; ఇషాన్‌ కిషన్‌ (బి) ముకేశ్‌ కుమార్‌ 111; బాబా ఇంద్రజిత్‌ (బి) రాహుల్‌ చాహర్‌ 78; అభిషేక్‌ పొరేల్‌ (ఎల్బీడబ్ల్యూ) ముకేశ్‌ కుమార్‌ 12; మానవ్‌ సుతార్‌ (బ్యాటింగ్‌) 8; ఎక్స్‌ట్రాలు 19; మొత్తం (79 ఓవర్లలో 5 వికెట్లకు) 357. వికెట్ల పతనం: 1–96, 2–97, 3–286, 4–311, 5–345. బౌలింగ్‌: ముకేశ్‌ కుమార్‌ 21–3–76–3; నవ్‌దీప్‌ సైనీ 17–2–78–1; వాషింగ్టన్‌ సుందర్‌ 10–0–55–0; నితీశ్‌ కుమార్‌ రెడ్డి 14–2–58–0; సాయికిశోర్‌ 12–0–46–0; రాహుల్‌ చహర్‌ 5–0–35–1.  

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)