Breaking News

టీమిండియా స్టార్‌ ప్లేయర్‌కు సర్జరీ.. మూడు నెలలు ఆటకు దూరం

Published on Wed, 06/12/2024 - 21:06

కొంత కాలంగా గాయంతో బాధపడుతున్న టీమిండియా స్టార్‌ ఆల్‌రౌ​ండర్‌ శార్దూల్ ఠాకూర్‌ ఎట్టకేలకు తన కుడికాలికి సర్జరీ చేయించుకున్నాడు. లండన్‌లో ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో వైద్యులు  ఠాకూర్‌కు శస్త్ర చికిత్స నిర్వహించారు.

అయితే తన శస్త్రచికిత్స విజయవంతమైనట్లు శార్దూల్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. ఆస్పత్రి బెడ్‌పై ఉన్న ఫోటోను ఠాకూర్‌ షేర్‌ చేశాడు. నా సర్జరీ విజయవంతంగా నిర్వహించబడింది అంటూ క్యాప్షన్‌గా ఠాకూర్‌ ఇచ్చాడు. 

కాగా ఠాకూర్‌ కుడి కాలి పాదానికి శస్త్రచికిత్స జరగడం ఇది రెండో సారి. ఐదేళ్ల క్రితం 2019లో తొలిసారి శార్ధూల్‌ సర్జరీ చేయించుకున్నాడు. అయితే ఈ గతేడాది దక్షిణాఫ్రికా పర్యటనలో భాగంగా గాయం మళ్లీ తిరగబెట్టింది.

దీంతో మరోసారి అతడు శస్త్రచికిత్స చేసుకోవాల్సి వచ్చింది. ఈ క్రమంలో అతడు మూడు నెలల పాటు ఆటకు దూరంగా ఉండనున్నాడు. శార్ధూల్‌ తిరిగి మళ్లీ ఈ ఏడాది ఆఖరిలో జరగనున్న రంజీ ట్రోఫీతో పునరాగామనం చేసే ఛాన్స్‌ ఉంది. కాగా ఐపీఎల్‌-2024లో చెన్నై సూపర్‌ కింగ్స్‌కు ఠాకూర్‌ ప్రాతినిథ్యం వహించిన సంగతి తెలిసిందే.
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)