Breaking News

హ్యాట్రిక్‌తో చెలరేగిన శార్ధూల్‌.. టీమిండియాలోకి రీ ఎంట్రీకి సిద్దం

Published on Thu, 01/30/2025 - 11:04

రంజీ ట్రోఫీ 2024-25 సీజ‌న్‌లో ముంబై స్టార్ ఆల్‌రౌండ‌ర్, టీమిండియా వెటరన్‌ శార్దూల్ ఠాకూర్(Shardul Thakur) త‌న సూప‌ర్ ఫామ్‌ను కొన‌సాగిస్తున్నాడు. ఈ టోర్నీలో భాగంగా శరద్ పవార్ క్రికెట్ అకాడమీ వేదిక‌గా  మేఘాలయతో జ‌రుగుతున్న మ్యాచ్‌లో శార్ధూల్ హ్యాట్రిక్ వికెట్ల‌తో మెరిశాడు.

ముంబై బౌలింగ్ ఎటాక్‌ను ప్రారంభించిన శార్దూల్ తొలి ఓవ‌ర్‌లోనే మేఘాలయ ఓపెనర్‌ నిశాంత చక్రవర్తిని డకౌట్‌ చేసి పెవిలియన్‌కు పంపాడు. ఆ త‌ర్వాత మ‌ళ్లీ మూడో ఓవ‌ర్ వేసిన లార్డ్ శార్ధూల్‌.. బి అనిరుధ్, సుమిత్ కుమార్, జస్కిరత్‌లను వ‌రుస బంతుల్లో ఔట్ చేశాడు.

దీంతో తొలి ఫ‌స్ట్‌క్లాస్ క్రికెట్ హ్యాట్రిక్‌ను ఠాకూర్ త‌న ఖాతాలో వేసుకున్నాడు. అత‌డి దెబ్బ‌కు మేఘాల‌య కేవ‌లం 2 ప‌రుగుల‌కే 6 వికెట్లు కోల్పోయి పీక‌ల్లోతు క‌ష్టాల్లో ప‌డింది. మేఘాలయ కెప్టెన్ ఆకాష్ చౌదరి(14), ప్రింగ్సాంగ్ సంగ్మా(18) ఇన్నింగ్స్‌ను చ‌క్క‌దిద్దే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. 15 ఓవర్లకు మేఘాలయ 6 వికెట్ల నష్టానికి 39 పరుగులు చేసింది.

కాగా ఈ మ్యాచ్ కంటే ముందు జ‌మ్మూ అండ్ కాశ్మీర్‌తో జరిగిన మ్యాచ్‌లో శార్ధూల్ ఠాకూర్ సెంచ‌రీతో మెరిశాడు. ఎనిమిదో స్ధానంలో బ్యాటింగ్‌కు వ‌చ్చిన శార్ధూల్ వ‌న్డే త‌ర‌హాలో త‌న సెంచ‌రీ మార్క్‌ను అందుకున్నాడు.  రోహిత్ శర్మ,జైశ్వాల్‌,రహానే, శ్రేయస్ అయ్యర్‌​ విఫలమైన చోట, ఠాకూర్ అద్బుతమైన సెంచరీతో మెరిశాడు.  శార్దూల్ 119 బంతుల్లో 17 ఫోర్ల సాయంతో 113 ప‌రుగులు చేశాడు. అంతకుముందు మ్యాచ్‌లో కూడా హాఫ్ సెంచరీతో ఈ ముంబై క్రికెటర్ రాణించాడు.

టీమిండియాలోకి రీ ఎంట్రీ ఇస్తాడా?
లార్డ్ ఠాకూర్ గత 14 నెలలగా జాతీయ జట్టుకు దూరంగా ఉంటున్నాడు. ఠాకూర్‌ చివరగా భారత్‌ తరుపున 2023లో సౌతాఫ్రికాపై టెస్టు మ్యాచ్‌లో ఆడాడు. ఆ తర్వాత పేలవ ఫామ్‌తో జట్టులో చోటు కోల్పోయాడు. అయితే శార్ధూల్‌ తన రిథమ్‌ను తిరిగి పొందాడు. దేశవాళీ క్రికెట్‌లో అద్బుతమైన ప్రదర్శన కనబరుస్తున్నాడు. 

ఈ ఏడాది ఇంగ్లండ్ పర్యటనతో శార్ధూల్ తిరిగి జట్టులోకి వచ్చే ఛాన్స్ ఉంది. అతడికి టెస్టుల్లో ఇంగ్లండ్ గడ్డపై అద్బుతమైన రికార్డు ఉంది. ఈ క్రమంలోనే ఇంగ్లండ్‌తో టెస్టులకు అతడిని ఎంపిక చేసే అవకాశమున్నట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి.
చదవండి: SA 20: వారెవ్వా.. క్రికెట్ చ‌రిత్ర‌లోనే సూప‌ర్ క్యాచ్‌! వీడియో వైర‌ల్‌

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)