Breaking News

శార్ధూల్ ఠాకూర్ 'సెంచ‌రీ'.. స్పెష‌ల్ జెర్సీ అంద‌జేత‌! వీడియో

Published on Tue, 04/08/2025 - 17:10

టీమిండియా వెట‌రన్‌, ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ స్టార్ ఆల్‌రౌండ‌ర్ శార్ధూల్ ఠాకూర్ త‌న ఐపీఎల్ కెరీర్‌లో వంద మ్యాచ్‌ల మైలు రాయిని అందుకున్నాడు.. ఐపీఎల్‌-2025లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదిక‌గా కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్‌తో మ్యాచ్ సంద‌ర్భంగా శార్ధూల్ ఈ ఫీట్ సాధించాడు. ఈ మ్యాచ్‌కు ముందు శార్థూల్‌.. లక్నో సూపర్ జెయింట్స్ మెంటార్ జహీర్ ఖాన్ చేతిల మీద‌గా వంద నెంబ‌ర్ గ‌ల ప్ర‌త్యేక జెర్సీని అందుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల‌వుతోంది.

ఆఖ‌రి నిమిషంలో ఎంట్రీ?
వాస్త‌వానికి శార్థూల్ ఠాకూర్ ఐపీఎల్‌-2025లో అమ్ముడుపోలేదు. రూ. 2 కోట్ల కనీస ధరతో వేలంలోకి వచ్చిన శార్దుల్‌ను  ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేసేందుకు ఆస‌క్తి చూప‌లేదు. దీంతో కౌంటీ క్రికెట్‌ ఆడేందుకు సిద్ధమవుతున్న ఈ ఆల్‌రౌండర్‌కు... ల‌క్నో మెంటార్‌ జహీర్‌ ఖాన్‌ నుంచి పిలుపు వచ్చింది. 

లక్నో పేసర్‌ మొహసిన్‌ ఖాన్‌ గాయంతో ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) 18వ సీజన్‌కు దూరం కావడంతో... అతడి స్థానంలో ప్రత్యామ్నాయంగా శార్దుల్‌ను జట్టులోకి తీసుకున్నారు. అయితే త‌న‌కు వ‌చ్చిన అవ‌కాశాన్ని శార్ధూల్ అందిపుచ్చుకున్నాడు.

ఇప్ప‌టివ‌ర‌కు ఈ సీజ‌న్‌లో ఐదు మ్యాచ్‌లు ఆడిన లార్డ్ ఠాకూర్‌.. 7 వికెట్లు ప‌డ‌గొట్టాడు. శార్ధూల్ త‌న ఐపీఎల్ కెరీర్‌లో ఇప్ప‌టివ‌ర‌కు కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్‌, చెన్నై సూప‌ర్ కింగ్స్‌, ఢిల్లీ క్యాపిట‌ల్స్‌, రైజింగ్ పుణే సూప‌ర్ జెయింట్స్‌, ల‌క్నో జ‌ట్ల‌కు ప్రాతినిథ్యం వ‌హించాడు.
చ‌ద‌వండి: చరిత్ర సృష్టించిన రజత్‌ పాటిదార్‌.. ఐపీఎల్‌లో తొలి కెప్టెన్‌గా అరుదైన ఫీట్‌
 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)