Breaking News

#Riyan Parag: 'అతడొక సంచలనం.. సూర్యకుమార్‌లా ఆడుతున్నాడు'

Published on Tue, 04/02/2024 - 17:45

ఐపీఎల్‌-2024లో రాజస్తాన్‌ రాయల్స్‌ ఆటగాడు రియాన్‌ పరాగ్‌  తన సూపర్‌ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. తొలి రెండు మ్యాచ్‌ల్లో అదరగొట్టిన పరాగ్‌.. సోమవారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. సంజూ శాంసన్‌, బట్లర్‌, జైశ్వాల్‌ వంటి స్టార్‌ ఆటగాళ్లు విఫలమైన చోట పరాగ్‌ సత్తాచాటాడు.

తన అద్బుత ఇన్నింగ్స్‌తో రాజస్తాన్‌ను పరాగ్‌ గెలిపించాడు. ఈ మ్యాచ్‌లో 39 బంతులు ఎదుర్కొన్న పరాగ్‌ 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 54 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. ఈ ఏడాది సీజన్‌లో ఇప్పటివరకు 3 మ్యాచ్‌లు ఆడిన పరాగ్‌.. 181 పరుగులతో ఆరెంజ్‌ క్యాప్‌ హోల్డర్‌గా కొనసాగుతున్నాడు. ఈ నేపథ్యంలో పరాగ్‌పై రాజస్తాన్‌ రాయల్స్‌ బౌలింగ్‌ కోచ్‌ షేన్‌ బాండ్‌ ప్రశంసల వర్షం కురిపిస్తున్నాడు. పరాగ్‌ తన ఆట తీరుతో సూర్యకుమార్‌ యాదవ్‌ను గుర్తు చేస్తున్నడంటూ బాండ్‌ కొనియాడాడు.

"పరాగ్‌ అద్బుతమైన ఆటగాడు. అతడు తన ఆట తీరుతో సూర్యకుమార్‌ యాదవ్‌ను గుర్తు చేశాడు. సూర్య ముంబై ఇండియన్స్‌లోకి కొత్తగా వచ్చినప్పుడు ఈ తరహా ప్రదర్శనే చేసేవాడు. పరాగ్‌కు మంచి బ్యాటింగ్‌ స్కిల్స్‌ ఉన్నాయి. అతడు కేవలం 22 ఏళ్ల వయస్సుకే అద్బుతమైన టాలెంట్‌ను సంపాందించుకున్నాడు. కచ్చితంగా మంచి భవిష్యత్తు ఉంటుంది.

ఈ ఏడాది సీజన్‌ ఆర​ంభానికి ముందు అతడు దేశవాళీ క్రికెట్‌లో అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు. అందుకే అతడికి బ్యాటింగ్‌ ఆర్డర్‌లో ప్రమోషన్‌ ఇచ్చాం. దేవ్‌దత్‌ పడిక్కల్‌ను వదులుకోవడంతో పరాగ్‌ ఆ స్ధానంలో బ్యాటింగ్‌ చేసే ఛాన్స్‌ ఉంది. అతడి నుంచి ఈ తరహా ప్రదర్శన కోసం మేము ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నాము.

రాజస్తాన్‌ అతడిపై పెట్టిన పెట్టుబడికి ఇప్పుడు ప్రతిఫలం పొందుతుంది. మిగిలిన సీజన్‌లో కూడా రియాన్‌ తన ఫామ్‌ను కొనసాగించాలని ఆశిస్తున్నానని" క్రిక్‌ట్రాకర్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బాండ్‌ పేర్కొన్నాడు.
 

Videos

వైభవ్ పై BCCI ప్రత్యేక నిఘా

ఎవరు మంత్రి కావాలి..? ఎవరి మాట వినాలి?

సాక్ష్యాలతో వస్తాం .. సిద్ధంగా ఉండు..! లోకేష్ కు YSRCP ఎమ్మెల్సీ సవాల్

కూటమిలో లోకల్ వార్.. బాబుకు జనసేన, బీజేపీ హెచ్చరిక

ఎక్కడ దాక్కున్నావ్ లోకేష్.. కొండారెడ్డి బురుజుకు ఇప్పుడురా..

సరదాకు ఉద్యమాలు చేయడం లేదు.. ఇంకెంతకాలం సాగదీస్తావ్ చంద్రబాబు

సాక్షి టీవీ సోషల్ మీడియా అకౌంట్లు బ్లాక్ చేయడం కూటమి పిరికి చర్య..

POLITICAL CORRIDOR: అవును వాళ్లిద్దరూ ఫ్రెండ్స్

మాజీ MLA మేకా వెంకట ప్రతాప్ అప్పారావు అరెస్ట్

KPHBలో కారు బీభత్సం, డ్రైవర్ నిర్లక్ష్యం..8 కుటుంబాలకు..!

Photos

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు