Breaking News

పాక్‌ ప్లేయర్‌ చారిత్రక శతకం

Published on Tue, 07/28/2026 - 15:05

వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్టులో పాకిస్తాన్‌ తాజా మాజీ కెప్టెన్ షాన్ మసూద్ అద్భుత శతకంతో సత్తా చాటాడు. మూడో రోజు మూడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన మసూద్ 163 బంతుల్లో 11 ఫోర్ల సాయంతో సెంచరీ పూర్తి చేశాడు. ఈ శతకం అతని టెస్ట్ కెరీర్‌లో 7వది. వెస్టిండీస్‌పై తొలి టెస్ట్ సెంచరీ.

చారిత్రక శతకం
టరౌబాలోని బ్రియాన్ లారా క్రికెట్ అకాడమీలో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ ఇది. ఈ వేదికపై టెస్ట్ సెంచరీ చేసిన తొలి బ్యాటర్‌గా షాన్ మసూద్ చరిత్ర సృష్టించాడు. 2025 జనవరిలో దక్షిణాఫ్రికాపై శతకం తర్వాత దాదాపు 18 నెలల విరామం అనంతరం మసూద్‌ చేసిన సెంచరీ ఇది.

బ్యాట్‌తో సమాధానం
ఇటీవల పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) షాన్ మసూద్‌ను టెస్ట్ కెప్టెన్సీ నుంచి తప్పించి, ఆ స్థానంలో బాబర్ ఆజంను మళ్లీ కెప్టెన్‌గా నియమించింది. కెప్టెన్సీ కోల్పోయిన వెంటనే మసూద్‌ బ్యాట్‌తో తన సామర్థ్యాన్ని మరోసారి నిరూపించుకున్నాడు.

కెప్టెన్సీ ఎందుకు తొలగించారంటే..?
2023లో టెస్ట్ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన మసూద్ నాయకత్వంలో పాకిస్తాన్ జట్టు ఆశించిన ఫలితాలు సాధించలేదు.

* ఆస్ట్రేలియాలో టెస్ట్ సిరీస్ ఓటమి
* దక్షిణాఫ్రికాలో టెస్ట్ సిరీస్ ఓటమి
* బంగ్లాదేశ్ చేతిలో స్వదేశంలో, వారి దేశంలో టెస్ట్ సిరీస్ పరాజయాలు

ఈ ఫలితాల నేపథ్యంలో నాయకత్వంలో మార్పు అవసరమని భావించిన PCB, మసూద్‌ను తప్పించి బాబర్ ఆజంను మళ్లీ టెస్ట్ కెప్టెన్‌గా నియమించింది.

మ్యాచ్‌ విషయానికొస్తే.. హోరాహోరీగా సాగుతున్న ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన విండీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో 311 పరుగులు చేయగా.. జస్టిన్‌ గ్రీవ్స్‌ (11-6-27-5) దెబ్బ​కు పాక్‌ తొలి ఇన్నింగ్స్‌లో 282 పరుగులకే చాపచుట్టేసింది. మసూద్‌ (109) సెంచరీ చేయడంతో పాక్‌ ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది.

స్వల్ప ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన విండీస్‌, పాక్‌ బౌలర్లు మూకుమ్మడిగా చెలరేగడంతో 126 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఆ జట్టు 155 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. కాగా, రెండు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌ కోసం​ పాక్‌ జట్టు వి​ండీస్‌లో పర్యటిస్తుంది.

 

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)