నా ఫెవ‌రేట్ కోచ్ అతడే.. గంభీర్ మాత్రం కాదు: ష‌మీ

Published on Tue, 08/04/2026 - 17:39

టీమిండియా సీనియ‌ర్ బౌల‌ర్ మ‌హ్మ‌ద్ ష‌మీ చానాళ్ల క్రిత‌మే జట్టుకు దూర‌మ‌య్యాడు. అయితే 2023 వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌లో అద్భుత ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిచిన ష‌మీ లీడింగ్ వికెట్ టేక‌ర్‌గా నిలిచాడు. వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ త‌ర్వాత గాయం బారిన ప‌డిన ష‌మీ మ‌ళ్లీ తిరిగి జ‌ట్టులోకి రాలేక‌పోయాడు. గాయం నుంచి కోలుకున్న ష‌మీ ఆ త‌ర్వాత‌ దేశ‌వాళీ క్రికెట్‌లో రాణించిన‌ప్ప‌టికీ సెలెక్ట‌ర్ల నుంచి పిలుపు మాత్రం రాలేదు. 

తాజాగా బీసీసీఐ చీఫ్ సెలెక్ట‌ర్ అజిత్ అగార్క‌ర్ 2027 వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ ప్ర‌ణాళిక‌ల్లో జ‌ట్టులో యువ బౌల‌ర్ల‌కే ఎక్కువ అవ‌కాశం ఉంటుంద‌ని, వ‌య‌సు మీద ప‌డిన క్రికెట‌ర్ల‌కు తాము అవ‌కాశాలు ఇవ్వ‌బోమ‌ని బాంబు పేల్చాడు. అంతేకాదు ష‌మీ లాంటి సీనియ‌ర్ బౌల‌ర్ల సేవ‌ల‌ను తాము గుర్తుంచుకుంటామ‌ని, వారు చాలా సార్లు జ‌ట్టుకు విజ‌యాలు అందించార‌ని తెలిపారు. 

అగార్క‌ర్ వ్యాఖ్య‌లు ష‌మీ, భువనేశ్వ‌ర్ వంటి సీనియ‌ర్ ఆట‌గాళ్ల‌కు ప‌రోక్షంగా రిటైర‌వ్వాల‌ని హింట్ ఇచ్చిన‌ట్లుగా అనిపించింది. దీంతో ష‌మీ అంత‌ర్జాతీయ కెరీర్‌కు దాదాపు ఎండ్‌కార్డ్ ప‌డిన‌ట్లే. ఇటీవ‌లే ఒక మీడియా చానెల్‌కు ష‌మీ ఇంట‌ర్వ్యూ ఇచ్చిన సంద‌ర్భంగా మీ ఫెవ‌రెట్ కోచ్ ఎవ‌రు అని ప్ర‌శ్న వేశారు. 

దీనిపై ష‌మీ స్పందిస్తూ.. ‘ఎవ‌రు బెస్ట్ కోచ్ అనేది పోల్చ‌డం చాలా క‌ష్టం. అయితే నేను గంభీర్ సార‌థ్యంలో టీమిండియాకు పెద్ద‌గా మ్యాచ్‌లు ఆడలేదు. ఇక రాహుల్ బాయ్‌, అనిల్ బాయ్‌, ర‌విశాస్త్రిల హ‌యాంలో మంచి క్రికెట్ ఆడాను. కానీ ఈ న‌లుగురిలో ఒక‌రిని ఎంపిక చేసుకోమంటే మాత్రం నేను ర‌విశాస్త్రి బాయ్ నా మొద‌టి ప్రాధాన్య‌త‌. అత‌డు కోచ్‌గా ఉన్న స‌మ‌యంలో నేను స్వేచ్ఛగా ఆడానన్న ఫీలింగ్ వ‌చ్చేది. 

అంతేకాదు ర‌వి భాయ్ అగ్రెసివ్ ఎంత‌లా ఉండేదంటే ప్ర‌తీ మ్యాచ్ మేము గెల‌వ‌డానికే ఆడుతున్నామా అన్న‌ట్లుగా ఉండేది. ర‌విశాస్త్రి కోచింగ్‌ను బాగా ఎంజాయ్ చేసేవాడిని’ అని ష‌మీ త‌న మ‌న‌సులోని మాట‌ను బ‌య‌ట‌పెట్టాడు. ఆ త‌ర్వాత 2023 వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌లో భార‌త ప్ర‌ద‌ర్శ‌న‌ను మ‌రోసారి గుర్తుచేసుకున్నాడు. 

‘‘2023 వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ నాకు ఎప్పుడూ గుర్తుండిపోతుంది. కానీ నా మైండ్‌లో క‌ప్ గెల‌వ‌లేద‌న్న బాధ మాత్రం అలాగే ఉండిపోయింది. ‘అతను ఇన్ని మ్యాచ్‌లు ఆడాడు, ఇన్ని వికెట్లు తీశాడు’ అని చూపిస్తూ ఒక రీల్ నా ముందు వచ్చినప్పుడు, నేను ఐసీసీ ఈవెంట్లలో ఆడలేకపోయిన మ్యాచ్‌లు నా మనసులోకి వస్తాయి. ఇన్నేళ్ల కెరీర్‌లో ఐసీసీ మెగా టోర్నీల్లో నేను మూడు, నాలుగు లేదా ఐదు మ్యాచ్‌లు ఆడలేకపోయాను.  ఒకవేళ నేను ఇవి ఆడి ఉంటే, ఇవాళ‌ అగ్రస్థానంలో ఉండేవాడిని." అని షమీ చెప్పుకొచ్చాడు.

ఇక ష‌మీ త‌న కెరీర్‌లోనే అత్యున్న‌త ప్ర‌ద‌ర్శ‌న 2023 వ‌న్డే వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో న‌మోదు చేశాడు. ఆ టోర్నీలో 24 వికెట్లు తీసిన ష‌మీ వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ చ‌రిత్ర‌లోనే ఏ ఎడిష‌న్‌కైనా అత్య‌ధిక వికెట్లు తీసిన బౌల‌ర్‌గా రికార్డుల‌కెక్కాడు. కానీ ఫైన‌ల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓట‌మితో టీమిండియా ర‌న్న‌ర‌ప్‌కే ప‌రిమిత‌మైంది.

Videos

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

Photos

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)